జగన్ అరెస్ట్ కు రంగం సిద్ధం

Publish Date:Apr 16, 2012

Advertisement

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులతో సహా అక్రమ ఆస్థులకు సంబంధించిన కేసులో జగన్ మొదటి ముద్దాయిగా వున్నారు. జగన్ అక్రమ ఆస్టుల కేసు విషయంలో సిబీఐ ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తుందని ప్రజలు భావించడంతోపాటు జగన్ కు ఆస్థులు సమకూర్చే విషయంలో తన ప్రతిభను చాటిన విజయసాయి రెడ్డిని రెండవ ముద్దాయిగా పేర్కొనడంతో పాటు అరెస్టు చేసినందుకు సిబీఐకి జాయింట్ డైరెక్టర్ ను ఒక హీరోగా చూశారు.

అయితే ఇదే సమయంలో కేసులో మొదటి ముద్దాయిగా వున్న జగన్ ను అరెస్టు చేయకపోవడంతో సిబీఐ విశ్వసనీయతను ప్రజలు అనుమానించడం ప్రారంభించింది. మొదటి ముద్దాయి స్వేచ్చగా తిరుగున్నప్పటికీ పట్టించుకోకుండా రెండో ముద్దాయిని అరెస్టు చేయడం, అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని కోరడం పట్ల చివరకు సిబీ కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. నిజానికి సిబీఐ కూడా ఇతరహ వ్యాఖ్యాలకోసమే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ను ఇతరుల తరహాలో అరెస్టు చేసేపక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన, బంద్ లకు పిలుపు ఇవ్వడం, రాస్తారోకోలు వంటి ఆందోళనలకు దిగే అవకాశం వుంది. దాంతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం వుంటుంది. మొదటి ముద్దాయిగా వున్న జగన్ ను అరెస్టు చేయకపోవడం వల్ల ప్రజలలో చర్చజరగడం, చివరకు కోర్టు కూడా అసహనం వ్యక్తం చేయడం వంటి అంశాల మేపత్యంలో రేపు జగన్ ను అరెస్టు చేసినా ప్రజలు సాధారణ అంశంగా భావించే అవకాశం వుంది. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబీఐ అధికారులు మూడు గంటలపాటు విచారించడం, సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్ళడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే జగన్ ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం వుందని భావిస్తున్నారు.

By
en-us Political News

  
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.