హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ప్లాస్టిక్ పాలు!!

Publish Date:Oct 11, 2019

Advertisement

 

మనం ఎన్నో రకాల కల్తీలు చూస్తుంటాం. కానీ స్వఛ్చంగా భావించే పాలు కూడా ప్లాస్టిక్ ఐతే అనే ఆలోచన అందరిలో అలజడి రేపుతోంది .హైదరాబాద్ లో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి. పాల ప్యాకెట్ ను కట్ చేసి కాగబెట్టి గానే ప్లాస్టిక్ ముద్దగా మారిపోతున్నాయి. ఇలాంటి పాలను ఏమరపాటుగా తాగితే అంతే సంగతులు. ప్రగతినగర్ లో ఈ కల్తీ పాల వ్యవహారం బయటపడింది.

పవన్ సౌమ్య దంపతులు ప్రగతినగర్ లో నివాసముంటున్నారు. ప్రగతినగర్ చౌరస్తా వద్ద ఉన్న సాయితేజా మిల్క్ సెంటర్ లో రెండు పాల ప్యాకెట్ లను కొని ఇంటి కి తీసుకొచ్చాడు పవన్. భార్య సౌమ్య ఒక అర లీటర్ ప్యాకెట్ ను గిన్నెలో పోసి స్టౌ పై కాగపెట్టింది.పాలు ఒక్కసారి గా విరిగిపోయి ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. గిన్నె ఏదైనా బాలేదేమోనని  మరోక పాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టారు. ఆ పాలు కూడా ప్లాస్టిక్ ముద్దగా మారడంతో సౌమ్యా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. పాల గురించి మిల్క్ సెంటర్ నిర్వాహకుడు నరసింహను ప్రశ్నిస్తే అతను దురుసుగా సమాధానమిచ్చాడు.ఈ పాలను చిన్నపిల్లలు తాగితే ప్రాణానికే ప్రమాదమని ఇలాంటి పాలను అమ్మవద్దని చెప్పినా నిర్వాహకుడు పట్టించుకోలేదు.ఇక చేసేది లేక పవన్ దంపతులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

"ఎప్పడు తమకు పాలు పోసే పాలవాడు దసరా సెలవుల సందర్భంగా ఊరు వెళ్లిన కారణంగా తాము దగ్గరలో ఉన్న పాల బూత్ కు వెళ్లి పాలు తెచ్చుకున్నామని,కానీ అవి కాచిన వెంటనే ప్లాస్టిక్ ముద్దగా మారటం చూసి ఆశ్చర్యపోయామని బాధితుదు తెలియజేశారు.ఇలా జరగటం పై ఆ బూత్ యజమానిని ప్రశ్నించగా అతడు దురుసుగా ప్రవర్తించిన తీరును వ్యక్తం చేశాడు".అభం శుభం తెలియని పసి పిల్లలు ఈ పాలను తాగితే వారి ప్రాణాలకే ప్రమాదం ఉండవచ్చు.అసలు ఇటువంటి కల్తీ సరుకుని అనుమతిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఏం చేస్తున్నారోనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.