ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏర్పాటుపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతానికి పాదయాత్రతోనే సరిపెట్టేయనున్నారు. స్వయంగా ఆయనే మర్మగర్భంగా చేసిన ట్వీట్ తో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఇన్ని రోజులూ వాటినై స్పందించని పీకే ఇప్పుడు పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇచ్చేశారు. పాట్నాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇస్తూనే.. తన భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున చంపారన్ లోని గాంధీ ఆశ్రమ్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రారంభించారు. దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో అందరి సమస్యలూ తెలుసుకుంటానని చెప్పారు. అసలు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వేత్తగా మారాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతో బీజేపీ కన్నెర్రకు గురి కావలసి వస్తుందన్న బెదురుతో జగన్ పీకేను దూరం పెట్టారు. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున పీకే పని చేసే అవకాశాలు దాదాపు మృగ్యమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
కాంగ్రెస్ లో చేరి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చక్రం తిప్పాలన్న పీకే వ్యూహం కూడా బెడిసి కొట్టింది. పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ సోనియా పీకే కండీషన్స్ ను ఒప్పుకోకపోవడం వల్లనే పీకే హస్తానికి దూరంగా ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంత వరకూ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పయనం చూస్తే.. ఒక సారి పని చేసిన పార్టీకి ఆయన రెండో సారి పని చేసిన దాఖలాలు కనిపించవు. ఆయన పని చేయలేదనడం కంటే పార్టీలే ఆయనను దూరం పెట్టాయనడం కరెక్టుగా ఉంటుంది. గుజరాత్ లో బీజేపీని గెలిపించడానికి తన వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అయిన పీకే.. ఆ జోరుతో ఎన్డీయేకు వ్యూహకర్తగా 2014లో పని చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఆయితే ఆ తరువాత బీజేపీ పీకేను దూరం పెట్టింది. తరువాత పీకే జేడీయూలో చేరారు. బీహార్ లో జేడీయూ అధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరడంతో ఆ పార్టీ నుంచి పీకే బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి వ్యూహకర్తగా మరి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించి సఫలం అయ్యారు. ఇప్పుడు కారణాలేమైతేనేం జగన్ కూడా పీకేను దూరం పెట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికల వ్యూహకర్తగానే కాకుండా పార్టీపై ఆధిపత్యం చెలాయించే పీకే ధోరణి కారణంగానే పార్టీలు ఆయనను దూరంపెడుతుంటాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పీకే సొంత పార్టీ పెట్టక, వ్యూహాలు తీసుకోవడానికి పార్టీలూ ముందుకు రాక ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-uturn-on-own-party-jagan-keep-aside-this-stratagist-25-135461.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.