జగన్ సర్కార్ విద్యుత్ సంస్థలకు డబ్బులు ఎగ్గొట్టేందుకు కొత్త పన్నాగం పన్నింది. ఏపీ డిస్కమ్ లు దివాళా తీశాయనీ, చెల్లింపులకు డబ్బులు లేవనీ చెబుతోంది. ఏపీ విద్యుత్ సంస్థలు ఏకంగా తమకు విద్యుత్ సరఫరా చేసిన సంస్థలకు చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని కోర్టుకు విన్నవించాయి. వాస్తవానికి సాంప్రదాయేతర విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేసి తీరాల్సిందేనని గత మార్చి 15న విస్పష్ట తీర్పు ఇచ్చిన ఏపీ హై కోర్టు ఆ చెల్లింపులకు ఆరు వారాల గడువు ఇచ్చింది.
అయితే ఆ తీర్పును ఏ మాత్రం ఖాతరు చేయని ప్రభుత్వం ఈ ఆరు వారాల పాటూ ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. ఇప్పుడు తమ వద్ద డబ్బులు లేని కారణంగా చెల్లింపు చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు చెబుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వం సాంప్రదాయేతర విద్యుత్ సంస్థలతో చేసుకున్న పీపీఏలను వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ఆ సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు పీపీఏల ప్రకారం ముందుకు పోవలసిందేనని తీర్పు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించడం నిలిపివేసింది. దీంతో ఆ కంపెనీలు మళ్లీ కోర్టును ఆశ్రయించాయి. ఈ సారి కోర్టు మరింత విస్పష్టంగా పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయాలని, బకాయిలు, భవిష్యత్ లో ధరలు కూడా పీపీఏలలో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలని తేల్చి చెప్పింది. దీంతో ఏపీ సర్కార్ విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు రమారమి రూ.20 వేల కోట్లుగా తేలింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ సొమ్ము చెల్లించి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇదిగో ఇక్కడే సర్కార్ కొత్త ఎత్తుగడకు తెరలేపింది. డిస్కమ్ లు రుణాల ఊబిలో కూరుకున్నాయనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కమ్ లు ఇప్పుడు చెల్లింపులు చేసే పరిస్థితిలో లేవనీ కోర్టుకు విన్నవించుకుంది. వాస్తవానికి ఏపీ సర్కార్ పీపీఏల బకాయిలు ఎగ్గొట్టే ఎత్తుగడతోనే వాటి నుంచి విద్యుత్ తీసుకోకుండా అంతకంటే అధికదర చెల్లించి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసిన సందర్భాలు బోలెడున్నాయి.
పీపీఏల విషయంలో ఏపీ తీరును కేంద్రం కూడా ఆక్షేపించింది. పీపీఏలను సమీక్షించడం సరికాదని జగన్ సర్కార్ ను హెచ్చరించింది. దీని వల్ల పెట్టుబడిదారులు ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా వినకుండా జగన్ సర్కాన్ మూర్ఖత్వంతోనో, మొండి తనంతోనో, గత ప్రభుత్వంవి అన్నీ రద్దు చేయాలన్న ఉద్దేశంతోనో పీపీఏల సమీక్షతో ముందుకు సాగింది. ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, అలాగే పీపీఏలకు భారీ మెత్తంలో బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు కోర్టులో ఏపీ వాదనపై తీర్పు ఏ విధంగా వస్తుందన్నది వేచి చూడాలి. అయినా విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులలో ఏపీ విఫలమైతే నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్ర నిధులు చెల్లిస్తామని గతంలోనే కేంద్ర విద్యుత్ మంత్రి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ దివాళా ఎత్తుగడ ఫలించే అవకాశం లేదనీ, ఆర్బీఐ నుంచి పీపీఏలకు బకాయిలను రాష్ట్ర వాటా నుంచి కేంద్రమే చెల్లించే అవకాశాలే మెండుగా ఉన్నానీ పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-discums-bankrupt-jagan-new-strtagy-to-avoid-payments-to-ppas-25-135457.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.