కాంగ్రెస్ లో పీకే చేరికను అడ్డుకున్నదెవరు?.. 2024ఎన్నికల్లో పీకేది ప్రేక్షక పాత్రేనా?

Publish Date:May 5, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికకు మోకాలడ్డిందెవరు? ఎవరికి పీకే రాకవల్ల నష్టం జరుగుతుంది? అంతా సిద్ధమయ్యాకా చివరి క్షణంలో పీకే కాంగ్రెస్ కు ఎందుకు దూరం జరిగారు? అసలింతకీ పార్టీలో చేరికకు పీకే పెట్టిన కండీషన్స్ ఏమిటి? సాధికారిక కమిటీలో భాగం కమ్మంటూ సోనియా బిగ్ ఆఫర్ ఇచ్చినా పీకే ఎందుకు వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ కు దగ్గరై పీకే కోల్పోయిందేమిటి? గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించినా నష్ట నివారణ కాకపోవడానికి కారణమేంటి. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా గుర్తింపు పొందిన పీకే నేడు ఏకాకిగా మిగిలిపోవడానికి కారణమేమిటి?

ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఈ అంశాలపైనే చర్చలు చేస్తున్నారు. ఎవరికి వారుగా తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. అసలింతకీ ఈ మొత్తం వ్యవహారం వెనుక జరిగిందేమిటి? కాంగ్రెస్ లో అధిష్టానానికి దగ్గరగా ఉండే వర్గాల కథనం ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్రియాశీలం అయిన ప్రియాంకా వధేరా గాంధీలే పీకే చేరికకు మోకాలడ్డారు.

 కాంగ్రెస్ లో గాంధీల ప్రాభవానికి చెక్ పెట్టి పార్టీని గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న పీకే కిశోర్ వ్యూహాలు బెడిసి కెట్టడానికి గాంధీ కుటుంబం ప్రతి వ్యూహమే కారణమని ఆ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా రాహూల్‌,ప్రియాంక   పీకే స్పీడుకు బ్రేకులు వేశారని చెబుతున్నాయి.   5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక వాద్రా ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. పీకే నియామకం జరగదని తేలడంతో ప్రియాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.

పార్టీ విజయానికి వ్యూహాలు రూపొందించాలని ప్రియాంక గాంధీ పీకేను కోరితే ఆయన అంతకు మించి..అన్నట్లుగా వ్యవహరించారనీ, రాహుల్ ప్రాధాన్యతను తగ్గించేలా పీకే చేసిన ప్రతిపాదనలను ప్రియాంక అంగీకరించలేకపోయారని అంటున్నారు. రాహుల్ ను పార్టీ పార్లమెంటరీ బోర్డుకే పరిమితం చేసి..ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న పీకే ప్రతిపాదన తమ కుటుంబంలో చీలిక తేచ్చే వ్యూహంలా ఉందని ప్రియాంక తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. 

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత రాహుల్ గాంధీ క్రియాశీలంగా పని చేస్తున్నారు. రాష్ట్రాల పర్యటనలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పీకే మాత్రం రాహుల్ లో నాయకత్వ లక్షణాలు లేవని బహిరంగంగా చేసిన ప్రకటన ప్రియాంక, రాహుల్ ఆగ్రహానికి కారణమైందని, అందుకే ఎన్నికల వ్యూహానికి మించి పార్టీ వ్యవహారాలలో వేలు పెట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పీకే పార్టీ విజయానికి చేసిన ప్రజంటేషన్ నచ్చిన సోనియా గాంధీ పార్టీ అంతర్గత వ్యవహారాల జోలికి కాకుండా సాధికార కమిటీలో భాగం అయ్యి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి వ్యూహరచనకే పరిమితం కావాలని పీకేకు ప్రతిపాదించినట్ల తెలుస్తున్నది. అదే సమయంలో పీకేను రాకను పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల అధ్యక్షులు వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వెనుక రాహుల్, ప్రియాంక వ్యూహం ఉందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. చివరకు సోనియా మొహమాటంతో సాధికార కమిటీలో సభ్యుడిగా పరిమితం కావాలని సూచించడంతో పీకే కాంగ్రెస్ చేరిక వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు.

ఇక్కడి దాకా ఒకెత్తయితే..ఈ మెత్తం ఎపిసోడ్ లో పీకేకు రాజకీయంగా జరిగిన నష్టం మాత్రం అపరిమితం అనే చెప్పాలి. పీకే కాంగ్రెస్ గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు, గాంధీ కుటుంబంతో, పార్టీ అగ్ర నేతలతో ఆయన వరుస భేటీలూ ఆయనకు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో అంతవరకూ ఉన్న సత్సంబంధాలు బెడిసేలా చేశాయంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇలా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పార్టీలు పీకేను దూరంపెట్టాలని నిర్ణయించుకున్నాయి. పీకే కాంగ్రెస్ కు దగ్గర కావడానికి చేసిన ప్రయత్నాల కారణంగా ఆయన వ్యూహకర్తగా పార్టీకి సేవలందిస్తే బీజేపీకి ఆగ్రహం కలుగుతుందన్న బెదురుతో జగన్ ఆయన సేవలను వచ్చే ఎన్నికలలో ఉపయోగించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 
ఇలా   వ్యూహాల బేహారికి దారులు మూసుకుపోవడంతో సొంత పార్టీ ప్రకటనతో రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆయన పార్టీ ప్రకటనకు ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పీకే ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుంటానంటూ చేసిన ప్రకటన కేవలం ఫేస్ సేవింగ్ ప్రయత్నంగా వారు అభివర్ణిస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కేవలం సొంత రాష్ట్రం బీహార్ కే పరిమితం అని అంటున్నారు. బీహార్ లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
 

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.