Publish Date:Apr 18, 2022
హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ తెలుగు రాష్ట్రాలలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతోందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వైసీపీలకు రాజకీయ సలహాదారు పీకేయే కావడంతో తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు తెలుగుదేశంతో ఎన్నికల పోత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ శిశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావమంతంగా లేకపోయినప్పటికీ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి గట్టి ప్రత్యర్థిగా ఉందనడంలో సందేహం లేదు. నిత్యం నిప్పు-ఉప్పులా విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకునే తెరాస, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అన్నది వినడానికి అసంభవం అనిపించేలా ఉన్నా జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు కారణంగా బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసకురావలసని అవసరం ఎంతైనా ఉందని పీకే గత కొంత కాలంగా వివిధ పార్టీల నేతలతో జరుపుతున్న సమాలోచనలలో ప్రతిపాదిస్తూనే ఉన్నారు.
వాస్తవానికి పీకే సూచనలూ, సలహాలతోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ కోసం మహారాష్ట్ర సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులతో సమాలోచనలు జరిపారన్నది పరిశీలకుల విశ్లేషణ.
ఈ నేపథ్యంలోనే పీకే సోనియాగాంధీ సహా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అధికార పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తాయన్న విశ్లేషణలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో ఇక్కడి పరిస్థితులను బట్టి అటువంటి విశ్లేషణలు తెలుగు రాష్ట్రాల మీడియాలో అంతగా కనిపించడం లేదు.
మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ బీజేపీని దీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగేందుకు సుముఖత చూపుతారనే భావించాలి. గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే. నాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ సర్కార్ లో తెరాస భాగస్వామిగా ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారం కోసం అగ్రెసివ్ గా కదులుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడును నిలువరించడానికీ, అలాగే కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికార పీఠం దక్కకుండా అడ్డుకోవడానికీ బీజేపీయేతర శక్తులన్నీఏకం కావాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, కేసీఆర్ రాజకీయ సలహాదారు పీకే కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కలిపి చూస్తే తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ ల మధ్య పొత్తు అసంభవమేమీ కాదనే భావించాలి. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఏమంత లేకపోవడం వల్ల జగన్ కు ఆ పార్టీని కలుపుకు పోవడానికి పెద్దగా అభ్యంతరాలేమీ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఏది ఏమైనా పీకీ షేక్ హ్యాండ్ తెలుగు రాష్ట్రాలలో కొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-meet-with-gandhis-sign-for-new-alliances-in-telugu-syates-39-134558.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.