Publish Date:Apr 18, 2022
ప్రభుత్వంతో విభేదాలు తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పునకు కారణమయ్యాయా? రాజ్ భవన్, ప్రభుత్వం మధ్యా అగాధం గవర్నర్ పదవికే ఎసరు పెట్టింది అని చెబుతున్నారు. కేంద్రం, తెరాస సర్కార్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కుతున్న నేపథ్యంలో గవర్నర్- ప్రభుత్వం మధ్య రిఫ్ట్ రాజకీయంగా తమకు నష్టం చేస్తుందన్న భావనతోనే కేంద్రం గవర్నర్ మార్పునకు మొగ్గు చూపిందంటున్నారు. బీజేపీ తమిళనాడు శాఖ ఉపాధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పని చేసిన తమిళసై 2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు.
తెలంగాణ గవర్నర్ గా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి కౌశిక రెడ్డి నియామకంపై అభ్యంతరం చెప్పడం, అలాగే ప్రజా దర్బార్ పేరుతో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు కేసీర్ సర్కార్ తో విభేదాలకు కారణమయ్యాయి. దీంతో రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ తెరాస మంత్రులు ఆమెపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతున్న నేపధ్యంలో ఇటువంటి విమర్శలు రాజకీయంగా నష్టం చేస్తాయన్న భావన రాష్ట్ర బీజేపీ వర్గాలలోనే వ్యక్తమౌతున్న నేపథ్యంలో నష్ట నివారణకు ఆమెను మార్చడమే ఖాయమని బీజేపీ అధిష్టానం భావంచి ఆమెను మార్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు.
దీంతో తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పు ఖాయమన్న వార్తలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. స్వల్ప వ్యవధిలో ఆమె రెండో సారి హస్తి వెళ్లడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. పది రోజుల కిందట తమిళసై హస్తిన వెళ్లి నప్పుడు ఆమె ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె వారికి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని హస్తినలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ వెళ్లడించారు. తద్వారా అప్పటి దాకా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధమేర్పడిందన్నవి ఊహాగానాలు కావు పచ్చినిజాలని గవర్నర్ కుండ ద్దలు కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ గవర్నర్ హస్తిన వెళ్లారు. ఒక ప్రజా ప్రతినిథి తనయుడి వివాహానికి వెళ్లినట్లు చెబుతున్నప్పటికీ హస్తిన పిలుపు మేరకేనని తెలుస్తోంది.
ఈ సారి ఢిల్లీ పర్యటన తమిళసైని తెలంగాణ గవర్నర్ గా మారుస్తున్నట్లు తెలియజేయడానికేనని అభిజ్ణ వర్గాల భోగట్టా.తెలంగాణ కొత్త గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ లేదా, కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నసీనియర్ నేత కేసీ రామమూర్తిలలో ఒకరిని నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళసై తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి ఇన్ చార్జి గవర్నర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే పుదుచ్చేరికి తమిళసైని పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పని చేసిన తమిళసైకు ఆ రాష్ట్రంలో రాజకీయ పునరావాసం లభించే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. ఉపాధ్యక్షురాలిగా పని చేసిన ఆమె సహజంగానే అధ్యక్షురాలిగా ఎలివేషన్ కోరుకుంటారు. అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అన్నామళై సమర్ధంగా పార్టీని నడుపుతున్న నేపథ్యంలో తమిళసైకి ఆ అవకాశం కూడా లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/differences-with-kcr-govener-tamilsye-tobe-replaced-39-134563.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.