Publish Date:Apr 18, 2022
ఈ ఫోటో చూడండి.. కొడాలి నాని ఏం చేస్తున్నాడో గమనించండి.. ఆవుల కొట్టంలో.. ఓ మంచమేసుకొని.. రెండు దిండ్లు పరుచుకుని.. హాయిగా రిలాక్స్ అవుతున్నారు. అప్పటి వరకూ పశువుల కొట్టంలో పని చేసి..చేసి అలసిపోయినట్టున్నారు.. కాసేపు ఇలా సేదతీరుతున్నట్టు ఉందీ ఫోటో..అంటున్నారు.
పాపం.. కొడాలి నాని. మంత్రి పదవి పోయిందనే ఫ్రస్టేషన్‌లో ఉన్నట్టున్నారు. జగనన్న కోసం అంత చేస్తే.. తన పదవే పీకేస్తాడా అంటూ తెగ ఫైర్ మీదున్నారట కొడాలి. ఇకపై ప్రెస్‌మీట్లు ఉండవనే బాధో.. బూతులు మాట్లాడే ఛాన్స్ రాదనే ఆక్రోషమో.. కారణం ఏమో తెలీదు కానీ.. ఆయన తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని నాని అనుచరులు చెబుతున్నారు. అందుకే, గుడివాడను వీడి రావట్లేదని అంటున్నారు. ఎమ్మెల్యేగా కొడాలి చేసే ప్రజా సేవ ఏమీ ఉండదు. మంత్రిగానూ పెద్దగా ఏం చేసేవారు కాదనుకోండి.. కనీసం ఆ మీడియా సమావేశాలకైనా పనికొచ్చే వారు. ఇప్పుడు జగనన్న ఆయన పోస్టును ఫసక్ అనిపించడంతో.. ఇక చేసేది లేక, పనేమీ లేక.. ఇలా పశువుల కొట్టానికి మకాం మార్చేసినట్టున్నారు. వైట్ షర్ట్ వేసుకొని.. ఆవులు, గేదెలు, పేడ కుప్పల మధ్య.. మంచంపై నడుం వాల్చి.. మంత్రిగా మూడేళ్ల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారేమో అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తుంటే.
లేటెస్ట్‌గా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్‌కు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. పదవి పోవడంతో మాజీ మంత్రి గారు బర్రెలు కాసుకుంటున్నట్టుందంటూ సెటైర్లే వేస్తున్నారు. జగనన్న దెబ్బ కొడితే.. పోయి పశువుల కొట్టంలో పడ్డట్టున్నారంటూ కొందరు.. గతంలో మీరు లారీ డ్రైవరో, క్లీనరో కదా.. పార్ట్ టైమ్‌గా ఆ పని కూడా చేసుకుంటే బెటర్ అని ఇంకొందరు.. పశువుల బాష మాట్లాడే మీకు ఆ లోకేషన్ బాగా సరిపోతుంది, ఇక అక్కడే పర్మినెంట్‌గా ఫిక్స్ అయిపోండంటూ.. ఇలా రకరకాలుగా కాక రేపే కామెంట్లతో కుమ్మేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు.. కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అందుకే మునుపటి జోరు ఆయనలో అసలే మాత్రం కనిపించడం లేదు. కేబినెట్ ర్యాంకుతో సమానమైన మరో పదవిని ఇస్తానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చినా నాని మాత్రం సంతృప్తిగా లేరంటున్నారు. మంత్రి పదవి మంత్రి పదవే అని.. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టు ఇచ్చినా ఆయన కూల్ అయ్యేలా లేరంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన ముఖంలో ఆనందమనేదే లేకుండా పోయింది. మంత్రి పదవి పోయినప్పటి నుంచీ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉండలేక.. ఇలా పశువుల పాకలో టైంపాస్ చేస్తూ.. రిలాక్స్ అవుతూ.. ఏదో అలా కాలం గడిపేస్తున్నారేమో అనుకుంటున్నారు ఈ ఫోటో చూసిన వాళ్లంతా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-with-cows-photo-going-viral-39-134553.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.