మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. పది రోజుల్లో మూడో సారి

Publish Date:May 22, 2026

Advertisement

దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై చమురు సంస్థలు ఇంధన ధరల భారం మోపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటంతో..  దేశీయ చమురు సంస్థలు శనివారం ( మే 23) మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.   గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు,  ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

 ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి లో రవాణాకు ఎదురౌతున్న ఆటంకాలు.. ధరల పెరుగుదలకు కారణం. ఇండియా తన మొత్తం ముడి చమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అలాగే సగానికి పైగా సహజ వాయువు అవసరాలకు కూడా విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. ఈ సరఫరా ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాల నుంచే జరుగుతుంది.  

తాజా పెంపు ప్రకారం   దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.98.64 నుంచి రూ.99.51 కి చేరుకుంది. అలాగే ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగి రూ.91.58 నుంచి రూ.92.49 కి ఎగబాకింది. కోల్‌కతా లో పెట్రోల్ ధరపై 94 పైసలు పెరగడంతో, అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.109.7 నుంచి రూ.110.6 కి చేరింది. అక్కడ డీజిల్ ధర కూడా 95 పైసలు పెరిగి రూ.97 కి చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 90 పైసలు పెరిగి రూ.108.4 కి చేరగా, డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.95 గా నమోదైంది.  చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.105.3 కి చేరగా, డీజిల్ ధర లీటరుకు 87 పైసలు పెరిగి రూ.96.9 కి పెరిగింది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (సీఎన్జీ) ధరలను కూడా కిలోకు రూ.1 చొప్పున పెంచడంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.81.09 కి చేరింది.

ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి  మే 15 న,  ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు  5 రూపాయల మేర పెరిగాయి.  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన గణాంకాల ప్రకారం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రేట్లను నియంత్రించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇందులో కేవలం ఉత్పత్తి వ్యయానికి, విక్రయ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసం వల్లే  లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. లక్ష కోటి వరకు నష్టం వాటిల్లింది. మే 11 న కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు ఎలాంటి తక్షణ బెయిలౌట్ ప్యాకేజీని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో, కంపెనీలు తమ నష్టాల నుంచి బయటపడటానికి ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలు లీటరుకు మరో రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.