ఏపీలో ఆ రెండు పార్టీలదే హవా ... అటో ఇటో తేల్చుకోండి అంటున్న జనం

Publish Date:May 18, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం మొత్తం ఆ రెండు పార్టీల మధ్యనే తిరుగుతోంది. అయితే, టీడీపీ కాదంటే వైసీపీ. ఈ రెండు ప్రాంతీయ పార్టీలే రాష్ట్ర  రాజకీయలను శాసిస్తున్నాయి. గత (2019) సార్వత్రిక ఎన్నికల ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటే, ఆ రెండు పార్టీలకు కలిపి 90 శాతానికి పైగా ఓట్లు (వైసీపీ 49.15 శాతం, టీడీపీ 39.58 శాతం) పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూస్టు పార్టీలు, జనసేన సహా ఇతర పార్టీలు అన్నిటికీ కలిపి పది శాతానికి కొంచెం అటూ ఇటుగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అంటే, భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఇప్పటికి అయితే తమిళనాడు తరహలో ఎపీలోనూ ప్రాంతీయ పార్టీలదే పైచేయి అని తేలిపోయింది. అలాగే, రెండు పార్టీల వ్యవస్థ దిశగా ఏపీ అడుగులు వేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. 

అయితే, ఇటీవల కాలంలో నేనున్నానంటూ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కొంత సందడి చేస్తోంది. కానీ, సినిమా స్టార్ పవన్ కళ్యాణ్   ఎంత సందడి చేసినా, జనసేన  ఒంటరిగా పోటీ చేస్తే తమిళనాడులో కమల్ హసన్ కు ఎదురైన అనుభవమే ఎదురవుతుందని, పవన్ అభిమానులే అంటున్నారు. అలాగే, జనసేన ఒంటరిగా పోటీ చేసినా లేక ఉందో లేదో తెలియకుండా ఉన్న బీజేపీతో పొత్తు కొనసాగించినా, ఫలితం తారుమరయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు గట్టిగా భావిస్తున్నారు.నిజానికి ఈ నిజం జనసేన, పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే, వైసేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు.

ఒక విధంగా పవన్ ప్రకటన తమ క్యాడర్ లో విశ్వాసం నింపేందుకే అని అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే  అనివార్యంగానే పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేశారని అంటారు.  అయితే, ఆ దిశగా జనసేన తరపు నుంచి ఇంకా పూర్తి  స్పష్టత రాలేదు. అయినా, పార్టీ క్యాడర్ లో అదే విధంగా జనంలో మాత్రం పొత్తుల విషయంలో స్పష్టత ఉందని పరిశీలకులు అంటున్నారు. సుమారు 40 శాతం ఓటుతో పాటు సంస్థాగత నిర్మాణం ఉన్న టీడీపీ లేకుండా వైసీపీని ఎదుర్కోవడం అయ్యే పనికాదని  జనసేన క్యాడర్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు సైతంస్పష్టం చేస్తున్నారు.

వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని, రాజకీయ కార్యకర్తలు,  సామాన్య ప్రజలు  కూడా అర్ధం చేసుకున్నారు. అదే విధంగా, ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తలకు కూడా క్లారిటీ ఉందని, అందుకే, టీడీపీతో పొత్తు పై మరింత స్పష్టత ఇవ్వాలని జనసేన స్థానిక నాయకుల పై ఆ పార్టీ క్యాడర్ వత్తిడి తెస్తోంది. అలాగే, క్రింది స్థాయిలో  ఇప్పటి నుంచే ఉభయ పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని, అదే విధంగా స్థానిక నాయకులు కూడా, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, కలిసి మెలసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి,  జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నా, జనసేన క్యాడర్ టీడీపీతో, టీడీపీ క్యాడర్ జనసేనతో కలిసి పనిచేయడం వైపే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ కలిసి వస్తే వస్తుంది లేదంటే లేదు, అవసరం అయితే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలను కలుపుకుని అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, చూడాలని జనసేన నాయకత్వం భావిస్తోంది.

నిజానికి బహిరంగ ప్రకటన లేక పోయినా జనసేన, స్థానిక నాయకులు ఆ దిశగా ఇప్పటికీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే పార్టీలతో సంబంధం లేకుండా, ప్రజలే, టీడీపీ పునాదిగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వేదికను సిద్దం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసుగెత్తిన అన్ని వర్గాల ప్రజలు అటో ఇటో తేల్చుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. సో.. పార్టీ పొత్తులు వ్యవహారం ఎలా ఉన్నా ప్రజలు మాత్రం ఇప్పటికే, ఒకటయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.