దిగివచ్చిన జగన్.. ఏబీవీ సస్పెన్షన్ ఎత్తివేత
Publish Date:May 18, 2022
Advertisement
ఎట్టకేలకు జగన్ సర్కార్ దిగి వచ్చింది. ఏబీవీని సర్వీసులోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏపీ ఇంటెలిజెన్స్ మజీ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావును సర్వీసులోనికి తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వ్యులలో పేర్కొని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా సూచించింది. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరరు తనను 2020 ఫిబ్రవరి 8 నుంచి అంటే తనను సర్వీసులోకి తీసుకోవాలని ఏబీవీ కోరుతున్నారు. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి8న విధుల్లోంచి తొలగించిన సంగతి విదితమే. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీవీ కోర్టులు సవాల్ చేశారు. గత నెలలో సుప్రీం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోటానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సస్పెన్షన్ రద్దయ్యింది. ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది పిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పి విచారణ ముగించింది. . ఈ నేపధ్యంలో ఏబీవీ సస్పెన్షన్ ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/jagan-sarkar-issued-go-taking-abv-into-serviece-25-136077.html





