పెద్దిసుదర్శన్ రెడ్డి ఇక లేరు.!

Publish Date:Jul 31, 2026

Advertisement

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,  బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ  గురువారం (జులై 30) అర్ధరాత్రి దాటిన తరువాత తుదిశ్వాస విడిచారు.   

గత ఆదివారం నర్సంపేటలోని తన నివాసంలో సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురై ఒ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) ప్రక్రియ ద్వారా గుండె కొట్టుకునేలా చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌  యశోద ఆసుపత్రికి తరలించి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు.

వైద్యుల కథనం ప్రకారం..  పెద్ది సుదర్శన్ రెడ్డికి   రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడం వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీనివల్ల గుండె రక్తనాళాల్లో అవరోధం ఏర్పడి ఆయన స్పృహ తప్పిపడిపోయారు. ఘటన సమయంలో సుమారు 45 నిమిషాల పాటు హృదయ స్పందన నిలిచిపోవడంతో మెదడుకు   ఆక్సిజన్ కొరత ఏర్పడి, నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా   ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. మెదడు పనితీరు పూర్తిగా నిలిచిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యింది.  పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ లో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.  పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తరలించారు. హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అభిమానులు, పార్టీ నాయకుల సందర్శన కోసం ఉంచి, అక్కడ నుంచి   నర్సంపేటకు తరలిస్తారు. మధ్యాహ్నం తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

వరంగల్ జిల్లా నల్లబెల్లి లో  జన్మించిన సుదర్శన్ రెడ్డి..  నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.  2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో   చురుగ్గా పాల్గొన్నారు.  2014 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా  బాధ్యతలు నిర్వహించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా  విజయం సాధించారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Peddi Sudarshan Reddy Passed Away,  Narsampet Ex MLA, BRS Leader , Telangana Politics News, Telugu One

By
en-us Political News

  
ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది.
బజాజ్ ఫైనాన్స్ క్యూ1 ఆర్థిక ఫలితాల్లో రూ. 5,986 కోట్ల నికర లాభం సాధించడంతో షేరు ధర 6% పైగా దూసుకెళ్లింది. మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చి రూ. 1,300 టార్గెట్ ధార్యాన్ని ప్రకటించిన వేళ సమగ్ర విశ్లేషణ.
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
టవర్లు లేకున్నా మీ మొబైల్‌కు డైరెక్ట్ సిగ్నల్స్ అందించేందుకు అమేజాన్ 5,105 ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. అమేజాన్ లియో D2D ప్రాజెక్ట్, గ్లోబల్‌స్టార్ డీల్ మరియు లాంచ్ టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఇకపై బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ సహాయంతో 1,072 బగ్స్‌ను సరిచేసి డైనమిక్ ప్యాచింగ్ సాంకేతికతను తీసుకొస్తున్న గూగుల్ విప్లవాత్మక అప్‌డేట్ వివరాలు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, 4K టీవీలపై భారీ ఆఫర్లు, ఎస్బీఐ కార్డ్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ప్లస్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఎర్లీ యాక్సెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల FPI కొనుగోళ్ల జోరు పెరిగింది. ఒకే రోజులో ₹8,831.1 కోట్ల రికార్డు పెట్టుబడులతో పాటు నిఫ్టీ, సెన్సెక్స్ విశ్లేషణ, ఐపీఓ పెట్టుబడులు మరియు మార్కెట్ ట్రెండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
MV ఎలక్ట్రోసిస్టమ్స్ IPO రోజువారీ GMP, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, షేరు ధర మరియు రైల్వే ప్రొపల్షన్ ఆర్డర్ బుక్ వివరాలను తెలుసుకోండి. మధురి కేలా మద్దతు ఉన్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చా లేదా బ్రోకరేజ్ విశ్లేషణ ఇక్కడ చూడండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026 డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన తల్లి, పీహెచ్‌డీ స్కాలర్ సీమా కాళిరామ్నా స్ఫూర్తిదాయక కథ. 11 నెలల బాబును వదిలి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం విశేషాలు చూడండి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం! వెయిట్‌లిఫ్టింగ్ రికార్డుతో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఫైనల్ విశేషాలు ఇవే!
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యంకాని అజేయ టెస్ట్ కెప్టెన్సీ రికార్డు, 36 ఆలౌట్ తర్వాత ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయం మరియు రహానే కెరీర్ విశేషాల సమాచారం ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.