ఇక పీకే దూకుడే.. న‌వ వ‌సంతంలోకి జ‌న‌సేన‌..

Publish Date:Feb 12, 2022

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, మరో నెలరోజుల్లో (మార్చి 14) న తొమ్మిదో ఏట అడుగు పెడుతోంది. తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది. 2014 మార్చి 14 న పురుడు పోసుకున్న జనసేన 2220 మార్చి 14న తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. అయితే, వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ సమయంలో, జనసేన సిన్సియర్’గా సింహలోకనం చేసుకుంటే నిజానికి ఇంత వరకు జనసేన సాధించిన గొప్ప విజయమంటూ ఏదీ లేదు.

జనసేన అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే, “ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ఉంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను.. బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను.. నాతో కలసి ప్రయాణం చేయడానికి మీరు సిద్దమా?” అని ప్రజలను పార్టీలోకి ఆహ్వానించే పవన్ కళ్యాణ్ పలుకులే ప్రముఖంగా కనిపిస్తాయి. నిజమే, ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా, ఒక్క ఒక్కడుగుతోనే మొదలవుతుంది, కానీ, ఈ ఎనిమిదేళ్ళలో జనసేన ఎంత దూరం పయనించింది అని, ప్రశ్నించుకుంటే, ప్రయాణించ వలసినంత దూరం ప్రయాణించ లేదు. 

అయితే, ఇంతవరకు ఒకెత్తు ఇక ముందు ఇంకొక ఎత్తు అంటున్నారు పార్టీ నాయకులు. ఇంత వరకు, పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అన్నట్లుగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. కానీ, ఆవిర్భావసభ మొదలు తగ్గేదేలే అన్నట్లుగా దూసుకు పోవడమే కానీ, బ్రేకులు, ఇంటర్వెల్స్ ఉండవని పార్టీ నాయకులు, శ్రేణులు అంటున్నారు. ఎన్నికలకు రెండు  సంవత్సరాల ముందు నుంచే జనసేనాని ఎన్నికల కురుక్షేత్రంలో కాలు పెడతారని, అందుకు తగిన విధంగానే. పవన్ కల్యాణ్ ఆవిర్భావసభను భారీగా ప్లాన్ చేస్తున్నామని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. కరోనా కూడా వెళ్ళిపోయినా నేపధ్యంలో మార్చి 14 న మంగళగిరి సమీపంలోని కాజాలో నిర్వహించే ఆవిర్భావ సభ, అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయించారు.   

ఇక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాందోళనలు, ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారని సమాచారం. పవన్ కళ్యాణ్’తో పాటుగా పార్టీ పార్టీ ఇతర నేతలు కూడా అప్పట్నుంచి ఎక్కువగా ప్రజల్లో ఉండేలా ప్రణాలికలను సిద్దం చేశారు. అవిర్భావ‌ దినోత్సవం నుంచి 2024 సారవత్రిక ఎన్నికల వరకు 24x7 ఎన్నికల ఎజెండాతోని ముందుకు పోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయనం ఉన్నా, ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఇప్పుడు జనసేనాని కూడా రంగంలోకి దిగితే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ‘పీక్’ కు  చేరుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.