ఇషాన్, శ్రేయాస్ బిగ్ హిట్.. రైనా ఫట్.. ఐపీఎల్ పోటుగాళ్లు..
Publish Date:Feb 12, 2022
Advertisement
డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఏకంగా డబుల్ సిక్స్ కొట్టేశాడు. ఐపీఎల్ యాక్షన్‌లో భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు. అయ్యర్‌ను కేకేఆర్ 12.25 కోట్ల ధరకు దక్కించుకుంది. గత సీజన్‌లో 7 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన అయ్యర్.. ఈసారి కనీస ధర 2 కోట్లతో వేలానికి వచ్చాడు. అయ్యర్ కోసం ఢిల్లీ, గుజరాత్, కోల్‌కతా పోటాపోటీగా పోటీ పడ్డాయి. చివరకు 12.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్ సొంతం చేసుకుంది. యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికాడు. ఇషాన్ కోసం గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ పోటీ పడగా.. మధ్యలో అనూహ్యంగా హైదరాబాద్ జట్టు పోటీలోకొచ్చింది. చివరికి రూ. 15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను దక్కించుకుంది. గతేడాది ఇతడి ధర రూ. 6.20 కోట్లు కాగా.. ఈసారి అతని రేట్ డబుల్ కావడం ఆసక్తికరం. ఇక, సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడాను పంజాబ్ 9.25 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన రబాడ కోసం ఈసారి గుజరాత్ గట్టిగానే ప్రయత్నించింది. మధ్యలో పంజాబ్ 9.25 కోట్లతో రబాడను ఎగరేసుకుపోయింది. శిఖర్ ధావన్‌ను సైతం పంజాబ్ జట్టు 8.25 కోట్లకు కొనుక్కుంది. గతేడాది అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌ను 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌ను 8.75 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. షిమ్రోన్ హెట్ మయర్‌పై 8.50 కోట్లు, యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌పై 7.75 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది. సీనియర్ ఆటగాడు అంబటి రాయుడుని తిరిగి దక్కించుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రూ.6.75 కోట్లు చెన్నై జట్టు సొంతం చేసుకుంది. గతేడాది ఇతడి ధర రూ.2.20 కోట్లు. మరోవైపు తొలిసెట్‌లో రవిచంద్రన్ అశ్విన్, డేవిడ్ వార్నర్ తక్కువ ధర పలికారు. అశ్విన్ ఇదివరకు ఢిల్లీ తరఫున 7.60 కోట్లకు ఆడగా.. ఈసారి రాజస్థాన్ 5 కోట్లకే కొనుగోలు చేసింది. ఇక, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ సైతం మెగా వేలంలో తక్కువ ధరనే పలికాడు. వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 కోట్లకే దక్కించుకుంది. గతేడాది వరకు అతడు రూ.11 కోట్లు తీసుకున్నాడు. అటు.. సురేశ్‌రైనా, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, షకీబ్ అల్ హసన్‌లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. --శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లు (కోల్‌కతా) మొదటి సెట్లో అమ్ముడుపోని ఆటగాళ్లు..
--హర్షల్ పటేల్ 10.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
--రబాడ రూ.9.25 కోట్లు (పంజాబ్)
--జేసన్ హోల్డర్ రూ.8.75 కోట్లు (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)
--షిమ్రోన్ హిట్‌మయర్ రూ. 8.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
--శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లు (పంజాబ్)
--నితీశ్ రాణా రూ.8 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
--ట్రెంట్ బౌల్ట్ రూ.8 కోట్లు (రాజస్థాన్)
--దేవ్‌దత్ పడిక్కల్ రూ.7.75 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
--కమిన్స్ రూ.7.25 కోట్లు (కోల్‌కతా)
--ఫా డుప్లెసిస్ రూ.7 కోట్లు (బెంగళూరు)
--క్వింటన్ డికాక్ రూ.6.75 కోట్లు (లఖ్‌నవూ)
--మహ్మద్ షమి రూ.6.25 కోట్లు (గుజరాత్)
--డేవిడ్ వార్నర్ రూ.6.25 కోట్లు (దిల్లీ)
--దీపక్ హుడా రూ.5.75 కోట్లు (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)
--అశ్విన్ రూ.5 కోట్లు (రాజస్థాన్)
--మనీశ్ పాండే రూ.4.6 కోట్లు (లఖ్‌నవూ)
--డ్వేన్ బ్రావో రూ.4.40 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
--రాబిన్ ఉతప్ప రూ.2 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
--జేసన్ రాయ్ రూ. 2 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
--సురేశ్ రైనా
--స్టీవ్ స్మిత్
--డేవిడ్ మిల్లర్
--షకీబ్ అల్ హసన్
http://www.teluguone.com/news/content/ipl-players-in-action-39-131671.html





