ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? పవన్ కు ఢిల్లీ సిగ్నల్ వచ్చిందా?

Publish Date:Oct 3, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? జనసేన చీఫ్ దూకుడు పెంచిందా అందుకేనా? ఈ ప్రశ్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా తీవ్రంగా పతనమైన వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని,  ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనలు వినిపించాయి. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంతో పాటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు పవన్ కల్యాణ్. రెండు సభల్లోనూ ఉద్వేగ ప్రసంగం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించిన పవన్ కల్యాణ్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే తన ప్రసంగంలో పదే పదే రానున్న ఎన్నికలు, రానున్న ఎన్నికలు అంటూ ప్రసంగించారు పవన్ కల్యాణ్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. రానున్న ఎన్నికలు అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. కేంద్రం పెద్దలతో పవన్ కల్యాణ్ కు మంచి సంబంధాలున్నాయి. గత నెలలో ఢిల్లీకి వెళ్లారు జన సేన చీఫ్. ఆ సమయంలో బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తేవడంతో.. ఆ దిశగా కేంద్ర నుంచి ఆయనకు ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జగన్  ప్రభుత్వ కాలం ఇంకా రెండున్నర ఏళ్ళకు పైగా ఉంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ గతం నుండి పేర్కొంటున్నట్లు జమిలి ఎన్నికలకు ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తారా? లేక మరే కారణముతో ముందుగానే రాష్ట్రంలో  ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది.  

చాలా కాలంగా రాజకీయంగా సైలెంటుగా ఉన్న పవన కల్యాణ్.. ఇటీవల కాలంలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. పవన్ పిలుపుతో జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. నరకప్రాయంగా మారిన రోడ్లపై జనసేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తూ రోడ్లు బాగుచేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై గతంలో ఎప్పుడు లేనంతగా రెచ్చిపోతున్నారు పవన్ కల్యాణ్. ఇంతేకాదు రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లోనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు బూతు పురాణం అందుకోవడంతో రచ్చ రచ్చైంది. 

వైసీపీని పవన్ ఇంతగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దల నుంచి సంతేకాలు రావడం వల్లే పవన్ కల్యాణ్ ఒక్కసారిగా స్పీడ్ పెంచారని అంటున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలు, బీజేపీ-జనసేన నేతల దూకుడుతో ఏదో జరగబోతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.