బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!

Publish Date:Nov 19, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ ఉన్న సన్నిహిత సంబంధాన్ని తాను ఎప్పుడో తెంచుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన  ప్రజా పాలన  ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రయోజనాలే తనకు  ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.     ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి   తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసుకున్నానని  పునరుద్ఘాటించారు. తాను తెలంగాణ బిడ్డనని, తనను ముఖ్యమంత్రిని చేసిన ఈ గడ్డకు నీటి విషయంలో   అన్యాయం ఎలా చేస్తానని, ఎందుకు చేస్తానని  ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని గతంలో సంతకం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరేనని  ఆరోపించారు.

కేసీఆర్, హరీశ్ రావుల రాజకీయ ప్రస్థానం, కుటుంబ ఆస్తులు, ప్రాజెక్టుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించింది దివంగత కాంగ్రెస్ నేత ఆనంతుల మదన్ మోహన్ అనీ,   అలాంటి వ్యక్తిపైనే కేసీఆర్ పోటీ చేశారని విమర్శించారు. ఆయన జ్ఞాపకార్థం సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా మామ, అల్లుడు, బావమరిది అంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావు, నాడు కాంగ్రెస్ దయతో  రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారని గుర్తుచేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, జన్వాడ ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయని ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ముందుండి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కారణంతోనే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతోందని రేవంత్  ధీమా వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్

రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట కార్యకర్తలు, నాయకులు చర్చించి సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని, ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తాము రద్దు చేయలేదని, పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా  5 లక్షల రూపాయల బీమా కవరేజీతో  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంచామన్నారు.

మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు.. సిద్దిపేట సభలో ప్రగల్భాలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన  దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి..  ఇప్పుడు ఒట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హరీశ్ రావు కౌంటర్‌తో సిద్దిపేటలో జరిగిన ఈ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.   

మీకు నచ్చవచ్చు:   మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?​

తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.!


[Revanth Reddy, Siddipetpublicmeeting, Chandrababu, Harish Rao, IndirammaFamily LifeInsurance]

By
en-us Political News

  
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.