చిరు అన్నయ్య అడుగుజాడల్లో  తమ్ముడు పవన్?

Publish Date:Oct 4, 2021

Advertisement

చరిత్ర తిరగబడుతోందా, 2009 కథ పునరావృతం అవుతోందా? చిరు అన్నయ్య అడుగుజాడల్లోనే తమ్ముడు పవన్ అడుగులు వేస్తున్నారా, అంటే, అవునని అనలేము కానీ, కాదనీ గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. ఇంచుమించిగా గత వారం పదిరోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, “పంచలు ఊడతీసి కొడతాం” అన్న పాత డైలాగు ఎవరికైనా గుర్తుకొస్తే, రావచ్చును. అది వాళ్ళ తప్పు కాదు, “తాట తీసి నార తీస్తా” వంటి ఫ్రెష్ డైలాగులు చెవిన పడినప్పుడు, రీలు గిరిగిరా ... వెనక్కి తిరిగి పవన్ కళ్యాణ్ పాత  డైలాగు గుర్తుకు రావచ్చును.

ప్రస్తుతం వైసీపీ, జనసేన పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మాములుగా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే, వైసీపీ మీద యుద్దమే ప్రకటించారు. సినిమాటిక్’గా పంచ్’లు పేల్చారు. కానీ, నిజంగా ఆయన యుద్ధానికి సిద్దంగా ఉన్నారా? అన్నదే అనుమానం. నిజంగా వైసీపీ అరాచక పాలనను, ఎదుర్కోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం  అయితే, బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలలో, తటస్థంగా ఉండాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంతేకాదు, పవన్ కళ్యాణ్ తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు సెంటిమెంట్ కార్డ్’ ను జత చేశారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చింది కాబట్టి, ఆమెను గెలిపించడమే న్యాయం ధర్మం అన్నట్లుగా మాట్లాడారు. అందుకే జనసేన పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. అంటే, జనసేన కార్యకర్తలు, అభిమానులు వైసీపీ అభ్యర్ధి పట్ల సానుభూతి చూపించి, ఆమెకు ఓటేసి గెలిపించాలని చెప్పకనే చెప్పారు. అలాగే, ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి ఉచిత సలహాకూడా ఇచ్చారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ అన్నచిరంజీవి అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు.

అలాగే సినిమా టికెట్ల గోలను, రాజకీయ రచ్చగా మలుపు తిప్పడం మొదలు  అనంతపురంలో బద్వేల్ ఎన్నికల బరిలో దిగడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించే వరకు సాగిన వీధి భాగోతం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, అరుపులు అన్నీ, ‘మగళగిరి’ ప్రొడక్ట్స్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో, తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేదు. కానీ కొన్ని జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో స్థానికంగా కొన్ని కొన్ని చోట్ల రెండు పార్టీల స్థానిక నాయకులు లోపాయికారీ ఒప్పదం కుదురుచుకున్నారు. అలా ఎక్కడైతే, తెలుగుదేశం, జనసేన దగ్గరయ్యాయో అక్కడల్లా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపధ్యంలో వైసీపీ వ్యూహకర్తలు పవన్ కళ్యాణ్’తో డీల్ కుదుర్చుకున్నారని, రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కుదిరిందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, పాత కాపులు, 2009 ఎన్నికలకు ముందు, మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పేరిట సాగించిన రాజకీయం గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి, ప్రజారాజ్యమే అన్నట్లుగా దూకుడు ప్రదర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ప్రజారాజ్యం పార్టీని , చిరంజీవిని టార్గెట్ చేసింది. ఇప్పుడు వైసీపే, తాడు బొంగరం లేని జనసేన, పవన కళ్యాణ్’కు ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.అయితే ప్రజారాజ్యం పార్టీ వైఎస్సార్ సృష్టి అనే విషయం ఆయన పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపినా తర్వాత కానీ తేలలేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి 36 శాతం తెలుగు దేశం పార్టీకి, ఇంచుమించుగా 29-30 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం ఐదారు శాతం మాత్రమే, కానీ, తెలుగు దేశం పార్టీ సారధ్యం లోని గ్రాండ్ అలయన్స్’కు 106 సీట్లు వచ్చాయి, అందులో 91సీట్లు టీడీపీకి వస్తే మిగిలిన స్థానాల్లో తెరాస (10), సిపిఐ, సిపిఎం (5) సీట్లు గెలుచుకున్నాయి.అయితే, ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్ష కూటమి ఓటమికి చిరంజీవి ప్రజారాజ్యం కారణం. ప్రజారాజ్యం పార్టీ 16.32 శాతం ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కానీ, చివరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. అందుకే ఇప్పుడు కొందరిలో చరిత్ర్ర పునరావృతం అవుతోందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్న మెగాస్టార్ అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నారా ?అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.