తెలంగాణా నాయకులు వై.ఎస్. కు అమ్ముడుపోయారు తెలుగువన్.కామ్ ఇంటర్వ్యూలో... పాల్వాయి

Publish Date:Mar 24, 2012

Advertisement

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్ ఒకరు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పదవుల కోసం తానెప్పుడు వెంపర్లాడలేదని ఆయన తరచు అంటుంటారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సీటు కోసం కొట్లాది రూపాయలు కుమ్మరించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తమకు అప్రయత్నంగానే ఆ సీటు దక్కిందని పాల్యాయి అంటున్నారు. ఆయన తెలుగువన్.కామ్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను గాని, రాపోలు ఆనంద భాస్కర్ గానీ రాజ్యసభ సీట్ల కోసం ఎటువంటి ప్రయత్నాలు, పైరవీలు చేయలేదని, కోట్లు కుమ్మరించే స్థోమత తమ ఇద్దరికీ లేదని అయినా అధిష్టానం తమ సేవలను గుర్తించి రాజ్యసభకు పంపిందని అన్నారు.

 

కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలకు ఇది సంకేతమన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికైన సి.ఎం. రమేష్, దేవేందర్ గౌడ్ లు కోటీశ్వరులు, వారు ఈ పదవుల కోసం సుమారు వంద కోట్లు కేటాయించినట్లు టి.ఆర్.ఎస్. నాయకుడు కె.టి.ఆర్ ఆరోపిస్తున్నాడు. పేదల కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ కోటీశ్వరులనే రాజ్యసభకు పంపింది. కానీ కాంగ్రెస్ పార్టీమాత్రం మాలాంటి పైసాకు ఠికానా లేని పేదోళ్ళను కూడా రాజ్యసభకు పంపింది. అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అన్నారు పాల్వాయి గోవర్ధన్. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. నాయకులు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయారని అందుకే తెలంగాణా ఉద్యమం బలహీన పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా తెలంగాణాను తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణావాణిని గట్టిగా వినిపిస్తానని పాల్వాయి గోవర్ధన్ చెప్పారు. తాను కరడు గట్టిన తెలంగాణా వాదినని అధిష్టానానికి తెలిసినప్పటికీ తనను రాజ్యసభకు పంపిందని, దీనిని బట్టి చూస్తే తెలంగాణా అంశంపై అధిష్టానం సుముఖంగా ఉందని అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

By
en-us Political News

  
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే  బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.