చంద్రుడిపై ఆవాసం.. నాసా ఆవిష్కరించనున్న అద్భుతం.!
Publish Date:Aug 17, 2026
Advertisement
అందని జాబిలి అందబోతోంది. చందమామమై నాసా ఒక శాశ్వత స్థావనాన్ని ఏర్పాటు చేయనుంది. 2030 నాటికల్లా ఈ స్థావరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా వేగంగా అడుగులు వేస్తున్నది. 1972 లో అపోలో 17 మిషన్ ద్వారా మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. చంద్రుది దక్షిణ ధ్రువం వద్ద ఈ బేస్ క్యాంప్‌ను నిర్మించేందుకు నాసా చేస్తున్న ఈ సన్నాహాలకు ప్రతిపదిక . దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారీగా మంచు రూపంలో నీరు నిల్వ ఉందన్న అంచనాలే. చంద్రునిపై ఉన్న మంచును తాగునీటికీ, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌గా విడగొట్టి భవిష్యత్ రోదసి నౌకలకు అవసరమైన రాకెట్ ఇంధనంగా కూడా మార్చుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రగ్రహంపై మైనస్ 248 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కనుక అధునాతన సాంకేతికతతో కూడిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, న్యూక్లియర్ పవర్ సిస్టమ్స్‌నుఇందు కోసం నాసా ఉపయోగిస్తోంది. ఈ స్థావర నిర్మాణంలో ఆర్టెమిస్ బేస్ క్యాంప్ ప్రధాన కేంద్రంగా నిలవనుంది. ఇందులో ఆధునిక లూనార్ టెర్రైన్ వెహికల్స్, వ్యోమగాములు నివసించడానికి ఒక పెద్ద హ్యాబిటాట్ హౌస్, సోలార్ ప్యానెల్స్ అలాగే కమ్యూనికేషన్ టవర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ వ్యోమగాములు దాదాపు రెండు నెలల పాటు చంద్రుడిపైనే నివాసం ఉంటూ.. పరిశోధనలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. NASA Artemis Project, Permanent Moon Base, Lunar Base Camp, Artemis 3 South Pole, NASA Moon Landing, Human Lunar Habitat
http://www.teluguone.com/news/content/nasa-artemis-project-36-229053.html




