అగ్రరాజ్యం అమెరికా ఆగమాగమవుతోంది. కొవిడ్ మహమ్మారి ధాటికి విలవిల్లాడుతోంది. క్రిస్మస్ , న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అమెరిక్లన కొంప ముంచాయి. జనాలు విచ్చలవిడిగా రోడ్లపై తిరగడంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించింది. అత్యంత వేగంగా విస్తరిస్తూ అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా యూఎస్ లో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అక్కడ 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య గతంలో కంటే మూడు రెట్లు పెరిగి.. ఒక్క రోజే 10లక్షలు దాటాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 10,42,000 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు గత గురువారం అమెరికాలో ఒక్కరోజే 5.91లక్షల కేసులు బయటపడగా.. తాజాగా దానికి రెట్టింపు కేసులు నమోదవడం కలవరపెడుతోంది. గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడినట్లు యూనివర్సిటీ పేర్కొంది. అమెరికాలో ఈ దఫా ఉద్ధృతి చిన్నారులపై ప్రభావం చూపిస్తోంది. ప్రతి రోజూ 500 కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
కొత్త కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం లక్కు పైగా కొవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారి సంఖ్య 18వేలకు పైనే ఉంది. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది ఆసుపత్రి పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ఆసుపత్రుల్లో చేరికలు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 5.5కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. అంటే దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా సోకింది. ఇక ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా మందిని మహమ్మారి బలితీసుకున్నట్లు జాన్ హాప్కిన్స్ డేటా వెల్లడించింది.
మరోవైపు అమెరికాలో వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి బూస్టర్ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు. 12-15 ఏళ్ల వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం అనుమతినిచ్చింది. ఈ వయసు వారికి రెండో డోసు తీసుకున్న 5-6 నెలల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే దీనిపై సీడీసీ నుంచి ఇంకా అనుమతులు రాలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/over-10-lakh-covid-cases-a-day-on-usa-39-129610.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.