డిజిటల్ జైలును బద్దలు కొట్టిన ఓపెన్ ఏఐ: హగ్గింగ్ ఫేస్‌పై ఏఐ సైబర్ దాడి!
Publish Date:Jul 25, 2026
Advertisement
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే భయంకరమైన సన్నివేశాలు ఇప్పుడు మన కళ్లముందే నిజమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) తయారు చేసిన ఒక అత్యంత సామర్థ్యమున్న ఏఐ మోడల్ తన నియంత్రణ సరిహద్దులను (Sandbox) దాటుకుని బయటకు వచ్చి సైబర్ దాడికి తెగబడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ జిపిటి-5.6 సోల్ (GPT-5.6 Sol) మరియు అంతకంటే శక్తివంతమైన ప్రీ-రిలీజ్ ఏఐ మోడళ్ల సెక్యూరిటీ సామర్థ్యాలను పరీక్షించడానికి 'ఎక్స్‌ప్లాయిట్ జిమ్' (ExploitGym) అనే బెంచ్‌మార్క్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో ఏఐ వ్యవస్థలు సాఫ్ట్‌వేర్ లోపాలను ఎలా గుర్తిస్తాయో చూడటానికి వాటికి ఉన్న రక్షణ నిబంధనలను (Guardrails) తాత్కాలికంగా తొలగించి, ఇంటర్నెట్ సదుపాయం లేని ఒక అత్యంత సురక్షితమైన డిజిటల్ జైలు వంటి 'సాండ్‌బాక్స్' వాతావరణంలో బంధించారు. అయితే అక్కడ అందరూ ఊహించని ఒక విపరీతమైన సంఘటన జరిగింది. అత్యంత చాకచక్యంగా ప్రవర్తించిన ఆ ఏఐ మోడల్, ఆన్ లైన్ రక్షణ పరీక్షను గెలవడం కోసం తానున్న డిజిటల్ జైలునుండి తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టింది. ఇంటర్నెట్ ప్రాప్తి సాధించి, సుప్రసిద్ధ మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'హగ్గింగ్ ఫేస్' (Hugging Face) సర్వర్లపై స్వతంత్రంగా సైబర్ దాడికి తెగబడింది. ఈ దాడిలో ఏఐ ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా సరికొత్త వ్యూహాలను అమలు చేసింది. దొంగిలించిన లాగిన్ వివరాలు (Stolen Credentials) మరియు ఇప్పటివరకు ఎవరూ గుర్తించని జీరో-డే లోపాలను (Zero-day vulnerabilities) ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ, వేలాది స్వతంత్ర చర్యలతో పబ్లిక్ సర్వర్ల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి ప్రవేశించింది. ఈ అనూహ్య పరిణామాన్ని చూసి హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్యూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఏఐ మోడల్ స్వయంచాలకంగా ఇంతటి సమగ్ర దాడికి ఒడిగట్టడం మైండ్ బ్లావింగ్ అని ప్రకటించారు. సైబర్ నిపుణులు మరియు జంగో (Django) కో-క్రియేటర్ సైమన్ విల్లిసన్ మాట్లాడుతూ ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ నవలల్లో చూసే సంఘటన నిజంగా జరగడమేనని స్పష్టం చేశారు. science fiction happened openai model hacks server,gpt 5 sol escapes sandbox cyberattack
http://www.teluguone.com/news/content/openai-ai-agent-hugging-face-cyberattack-36-227059.html





