హైట్క్ సిటీలో ఆన్లైన్ మోసాలు !
Publish Date:Jul 19, 2012
Advertisement
మీరు నిరుద్యోగులా అయితే మా కన్సల్టెన్సీకి రండి మంచి జీతం ఉన్న ఉద్యోగం పట్టండి ఆనందంగా జీవించండి అనే నినాదంతో ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు నమ్మరాదని పోలీసులు నాలుగేళ్లుగా పలుదఫాలుగా ప్రకటనల్లో కోరుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలను పత్రికల్లో చదివిన వారు కూడా తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందని ముందూ వెనుకా ఆలోచించకుండా ఈ ఆన్లైన్ కన్సల్టెన్సీ సంస్థల్లో డబ్బులు కట్టేస్తున్నారు. ఇలా లక్షలాది రూపాయల చొప్పున నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సిటీఫెసిలిటీ మేనేజ్మెంట్ బోర్డు తిప్పేసింది. దీంతో వందల సంఖ్యలో బాధితులు హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో నగరనేరపరిశోథనావిభాగం (సిసిఎస్)ఒక ప్రత్యేకకౌంటర్ను తెరిచి ఫిర్యాదులు అర్థరాత్రి వరకూ తీసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు సిసిఎస్ ప్రత్యేకబృందాలను రంగంలోకి దించింది. నిందితులు విదేశాలకు పారిపోకుండా ఎయిర్ పోర్ట్లలో అలెర్ట్ ప్రకటించాలని వందల కోట్ల రూపాయల్లో రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు తదితరులు నష్టపోయినందున నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులుగట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ కోరారు. తరుచుగా జరుగుతున్న ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
http://www.teluguone.com/news/content/online-trading-fraud-in-hitech-city-24-15755.html





