ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
Publish Date:Aug 26, 2026
Advertisement
సాదిక్ తల్లి సంచలన వ్యాఖ్యలు..! ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక మలుపులు వెలుగుచూస్తున్నాయి. ఈ విచారకర సంఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులు మొదటిసారిగా స్పందించారు. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాదిక్ తల్లి నూర్జహాన్ పాల్గొని పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తమపై వస్తున్న అభియోగాలను ఆమె తీవ్రంగా ఖండించారు. మృతురాలు సౌజన్యనే స్వయంగా తమ ఇంటికి వచ్చి పెళ్లి ప్రతిపాదన తెచ్చిందని, అయితే తామే ఆ ప్రతిపాదనను తిరస్కరించామని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ కలహాలు వ్యక్తిగత కారణాల వల్లే ఈ అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని నూర్జహాన్ పేర్కొన్నారు. సౌజన్య మొదటి భర్త జగదీశ్వర్ రెడ్డి మరణంతో తమ కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. పైగా గతంలో సౌజన్య పిలుపు మేరకు వెళ్లిన తమ కుమారుడిపై దాడికి తెగబడ్డారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, ఆస్తులు బంగారాన్ని కాజేసినట్లు వస్తున్న ఆరోపణాల్లో నిజం లేదని తెలిపారు. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, గుర్తింపు కార్డులతో సహా అన్ని కీలక ఆధారాలను ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి అందజేసినట్లు నూర్జహాన్ వెల్లడించారు. ఇటీవల రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి నదిలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య దూకి ప్రాణాలు తీసుకున్న విషయం విదితమే. ఈ దుర్ఘటనలో సౌజన్య చిన్న కుమారుడు రియాన్ష్‌ను స్థానిక మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు సాదిక్‌ను ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉండగా, ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ దర్యాప్తునకు కొత్త కోణాన్ని జోడించాయి. మరికొద్ది రోజుల్లో పోలీస్ విచారణ పూర్తి కానుండటంతో ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. Nukaraju Family Suicide Case, Sadiq Khan Rifle Coach, Godavari Suicide Case, Kakinada Crime News, TeluguOne News, Telugu News
http://www.teluguone.com/news/content/nukaraju-family-suicide-case-43-229948.html





