బెజవాడలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ... మార్చి 6న శంకుస్థాపన
Publish Date:Mar 3, 2025
Advertisement
ఇక విజయవాడలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రజలకు అందుబాటులో రానుంది. మార్చి ఆరో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. ఇప్పటివరకు తెలంగాణ బంజారాహిల్స్ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలుగు రాష్ట్రాల్లో సేవాకార్యకలాపాలు చేపట్టింది. ఈ ట్రస్ట్ భవన్ లోనే తెలంగాణ టిడిపి కార్యాలయం కూడా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం ఏర్పాటు చేసి సామాజిక సేవాకార్యకలాపాలు మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవననిర్మాణానికి అవసరమయ్యే భూమిని ట్రస్ట్ కొనుగోలు చేసింది భవనం కోసం 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. మొత్తం ఐదంతుస్థుల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణపనులు ప్రారంభించనున్నారు .ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భవనం పూర్తయితే రెండు రాష్ట్రాల ట్రస్ట్ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా కొనసాగనున్నాయి.
http://www.teluguone.com/news/content/ntr-trust-bhavan-in-bejawada-toostarted-on-6th-march-39-193754.html





