పుణ్యానికొస్తే చికెన్ ఇష్టం.. పైసలు పెట్టాలంటే బర్డ్ ప్లూ భయం 

Publish Date:Mar 3, 2025

Advertisement

కొనుక్కతింటే రోగ మస్తది పుణ్యానికొస్తే రోగం లేదు గీగం లేదు అన్నట్టు ఉంది తెలుగు రాష్ట్రాల్లో చికెన్  ప్రియుల వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయంతో కొన్ని రోజుల నుంచి చికెన్ తినడమే బంద్ చేశారు. చికెన్ కు సబ్ స్ట్యూట్ గా మటన్, ఫిష్ కోసం  జనం ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్టీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమ కోళ్లను ఫామ్ హౌజ్ పక్కనే గుంత తీసి పూడ్చేస్తున్నారు. చికెన్ ప్రియులు రిజెక్ట్ చేయడంతో సప్లయ్ బాగా తగ్గింది.   సప్లయ్ తక్కువైతే డిమాండ్ పెరుగుతుంది అనే ఎకనామిక్ ఫార్ములా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంది. మటన్ ధరలు విపరీతంగా పెంచేశారు. జనాల్లో ఉన్న భయం ఎన్ క్యాష్ చేసుకునే పద్దతిని ఒంట బట్టించుకున్నారు. కొన్ని చోట్ల చికెన్ సెంటర్లను మూసేసి మటన్ షాపులు తెరచుకున్నాయి. తొలుత నష్టాలను చవి చూసిన చికెన్ షాపు ఓనర్లు ఇప్పుడిప్పుడే లాభాలు  చూస్తున్నారు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ క్యాంపెయిన్ నెగెటివ్ నుంచి పాజిటివ్ గా మారిపోయింది. అధికార , విపక్ష అనే తేడా లేకుండా ఒక్కటయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి చికెన్ తినండి అని ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు.

ఆల్ రిలేషన్స్ అన్నీ డబ్బుతో ముడిపడటమే దీనికి ప్రధాన కారణం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలన్నీ అధికార, విపక్ష నేతలవే  ఎక్కువగా ఉండటం కారణమని చెప్పుకోవచ్చు. నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి  స్థానికంగా నిర్వహిస్తున్న చికెన్ మేళాలను ప్రమోట్ చేస్తుంటే సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు  ఇటీవలె చికెన్ మేళాలకు హాజరై 100 టెంపరేచర్ లో బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని  చెబుతున్నారు.     నేను రోజూ చికెన్ ముక్క లేనిదే ముద్ద  గొంతులో    దిగడం లేదని సిగ్గూ ఎగ్గూ లేకుండా చెప్పేస్తున్నారు.  యాంటీ బర్డ్ ఫ్లూ క్యాంపెయిన్ కు  ఈ మాజీ మంత్రి   బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. . బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న  భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటికి చికెన్ ప్రియులు ఎగ బెడుతున్నారు. చికెన్ వెరైటీ వంటకాలకు ఎగబడుతున్న జనం తెల్లారి చికెన్ షాపుల మోహం చూడటం లేదు. తాజాగా చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలకు చికెన్ ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చికెన్ వంటకాలను ఆస్వాదించడానికి నాన్ వెజ్ ప్రియులు బారులు తీరుతున్నారు.పుణ్యానికొచ్చిన చికెన్ తింటున్న జనం పైసలు పెట్టి కొనుగోలు చేయాలంటే బర్డ్ ఫ్లూ అని భయపడుతున్నారు.  నార్మల్ డేస్ రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.