అన్నా .. అందుకో వందనం!

Publish Date:Jan 17, 2023

Advertisement

నందమూరి తారక రామా రావు... ఎన్టీఆర్... ఈ పేరుకు ఇక వేరే పరిచయ వాక్యాలు అక్కరలేదు. నందమూరి అనగానే, అన్న ఎన్టీఆర్  అపురూప రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఒక సినిమా హీరోగా ఆయన జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వెంకన్న దేవుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు  సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి  నుంచి ఈ నాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లా ఉంటారు, అంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయంగా జీవించారు. మచ్చలేని మహారాజులా నిష్క్రమించారు. అందుకే ఆయన కన్నుమూసి 27 ఏళ్ళు అయినా ఈ నాటికీ ఆయన్ని తెలుగు గుండె గుర్తుచేసుకుంటోంది. 

అవును ఈరోజు ... జనవరి 18, ఎన్టీఆర్ 27 వ వర్ధంతి. ఎన్టీఆర్ సినిమా రంగానికే కాదు, సమాజానికీ సేవలందించారు. ఆరు పదులకు పైగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్, తనను అంతవాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవచేసే  పవిత్ర సంకల్పంతో   రాజీకీయ అరంగేట్రం చేశారు.  చరిత్రను సృష్టించారు.  అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదుగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ చిక్కని, సాధ్యం కాని విధంగా చరిత్రను సృష్టించారు.  ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీన తెలుగు దేశం జెండాను ఎగరేశారు. “నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ,  నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం” అని ప్రకటించారు. ఆంధ్రుల  అన్నగా అవతారం ఎత్తారు. తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంత వరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా 1993 జనవరి 9, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం చాలా చిన్నది. నిండా పుష్కర కాలం కూడా లేదు. ఆ స్వల్ప కాలంలోనూ ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కున్నారు. అయినా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మ గౌరవ బావుటాను ఎగరేసిన ఎన్టీఆర్, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు చెక్  పెట్టి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్  వ్యతిరేక శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ తిరోగమానానికి ఆనాడే ఆయన శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు.  అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిర స్థాయిగా ఒక మెయిలు రాయిలా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. 

అందుకే ఈనాటికీ  జాతీయ స్థాయి నేతలంతా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గౌరవంగా స్మరించుకుంటున్నారు.    మంగళవారం(జనవరి 17) ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ  తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించారు. ప్రజా క్షేత్రంలో ఎన్టీఆర్ కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చారని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్‌ ముందడుగు వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నిజానికి ఒక మోడీ అని కాదు, రాజకీయాలకు అతీతంగా జాతీయ నేతలందరూ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

అలాగే ఎన్టీర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు అడుగుజాడల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పథకాల పేర్లు మారవచ్చును కానీ, స్పూర్తి మాత్రం  అదే.  ఎన్టీఅర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నేత ఎన్టీఆర్. అలాగే, పారదర్శక పాలన, ప్రజల వద్ధకే  పాలన వంటి పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అంతే కాదు, తెలుగుంటి ఆడపడుచులకు పెద్దన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు వంటి చట్టాలు తెచ్చారు. 

నిజానికి  ఆధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్  ఒక మేలి మలుపుగా నిలుస్తారు. ఎన్టీఅర్ కు ముందు ఒకటి  రెండు కులాలకే పరిమితం అయిన రాజకీయ అధికారాన్ని,అందరికీ చేరువ చేసిన సామాజిక చైతన్య స్పూర్తి ఎన్టీఆర్. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన, బడుగుల అత్మబందువు ఎన్టీఆర్. 

అందుకే నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి ప్రధాన ఆయుధాలుగా సాగిన  ఎన్టీఆర్ అనే మూడక్షరాల రాజకీయ ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఒక మహా నటుడిగా, ఒక మహోన్నత వ్యక్తిగా, ప్రస్వామ్య స్పూర్తి ప్రదాతగా, ఒక పరిపాలన దక్షునిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర పురుషునిగా, పేద ప్రజల ఆరాధ్య దైవంగా...ఇలవేల్పుగా తెలుగు వారి గుండెల్లో కొలువైన విధాతగా ఎన్టీఆర్ శాశ్వతంగా ఉండి పోతారు ఎన్టీఆర్..  అన్నా ..అందుకో వందనం..

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.