బండి పదవి పదిలం.. ఎన్నిల సారధి ఆయనే

Publish Date:Jan 18, 2023

Advertisement

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మరో రెండేళ్ళ పాటు అదే పదవిలో కొనసాగుతారు. బీజేపీ ఆయన సారధ్యంలోనే తెలంగాణ 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కుంటుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.   మంగళవారం(జనవరి 17)తో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పార్టీ సంస్థాగత మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా, ఈ సంవత్సరం (2023)లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులను మార్చరాదని బీజేపీ జాతీయ కార్యవర్గం  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్తుత అధ్యక్షులనే 2024 లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని సూత్రప్రాయంగా బీజేపే జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.  దీంతో,ఇంతవరకు సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెర పడింది. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తారనే ఊహాగానలకూ జాతీయ కార్యవర్గం తెర దించింది.  మరో నలుగు రోజుల్లో రెండేళ్ళ పదవీ కాలం ముగుస్తున్న పార్టీ అధ్యక్షుడు జీపీ నడ్డా  పదవీ కాలన్ని మరో రెండేళ్ళు పొడిగించాలని  కార్యవర్గం నిర్ణయించింది.

అదలా ఉంటే బండి అధ్యక్ష పదవిలో కొనసాగడం ఖాయమైన నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న కేంద్ర  మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే విషయంలో కొత్త చర్చ తెరపై కొచ్చింది. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలలో పాత కాపులు ఇద్దరికీ పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కాబినెట్ లో స్థానం దక్కితే బండి సంజయ్’ పార్టీ అధ్యక్షినిగా కొనసాగుతున్నారు.  కాగా, 2019 ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆదిలాబాద్  ఎంపీ సోయం బాబు రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లో ఒకరికి మంత్రి పదవి దక్క వచ్చని అంటున్నారు. అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో గిరిజన ఎంపీ సోయం బాబూ రావును మంత్రి పదవి వరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గత విస్తరణలోనే ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి క్షణంలో వచ్చిన అవకాశం చేజారి పోయింది. సో ..  ఈ సారి బాబూ రావుకు బెర్త్ ఖాయమని అంటున్నారు.

అయితే  యూపీ నుంచి రాజ్య సభకు ఎన్నికైన మరో పాతకాపు, డాక్టర్ కే. లక్ష్మణ్ పేరు కూడా తెలంగాణ కోటాలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పదవులన్నీ పాత  వారికే ఇస్తే  కొత్తగా వచ్చే వారిలో ఆసక్తి లేకుండా పోతుందని, రావాలనుకునే వారికీ తప్పుడు సంకేతం  వెళుతుందని  అదుకే  గిరిజన ఎంపీ సోయం బాబూ రావుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాగే,ఈటల రాజేందర్ కు కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అలాగే, మంత్రివర్గ  విస్తరణ తర్వాత పార్టీలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.