మరో ఏడేళ్లలో కేసీఆర్ ప్రరాస?!

Publish Date:Jan 17, 2023

Advertisement

తేదీ..17 జనవరి 2029.. ఈ  రోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈ రోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని,  భారాస అధినేత,  సిధ్ధాంత కర్త,   కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు మనోభీష్టం మేరకు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మారుస్తూ భారాస సర్వ సభ్య సమావేశం తీర్మానించింది.

హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో  జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో సభాధ్యక్షుడు కేసీఆర్ ప్రపంచంలో పరిస్థితులను వివరిస్తూ ప్రసంగించారు.    దేశాలు మధ్య తరచూ గిల్లి కజ్జాలతో ప్రపంచశాంతికి భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే సమీప భవిష్యత్ లో ప్రపంచం నాశనం అవుతుందనీ,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమెరికా, చైనా, రష్యా లాంటి   దేశాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిచారు.   

యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో  విఫలం అయ్యిందని పేర్కొన్న కేసీఆర్.. ఇక ఐరాస కాలం చెల్లిన సంస్థ అని ప్రకటించారు. ఇప్పుడు వినాశనానికి చేరువలో ఉన్న ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత తాను తీసుకుంటున్నారనీ, అందుకే భారత్ రాష్ట్ర సమితి( భారాస)ను ప్రపంచ రాష్ట్ర సమితి (ప్రరాస)గా మారుస్తున్నాననీ కేసీఆర్ ప్రకటించారు. భారత దేశాన్ని కాపాడేందుకు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను భారత రాష్ట్ర సమితి (భారస)గా మార్చినప్పుడు కూడా తనను ఎందరో ఎన్నో రకాలుగా విమర్శించారనీ, ఎద్దేవా చేశారనీ.. కానీ భారాస వల్లనే ఏపీ, తెలంగాణ సహా దేశంలోని రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు.  ఇప్పుడు కూడా   ప్రరాస   దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేస్తుందన్నారు. ఆ హామీ, పూచీ తనదని వక్కాణించారు. 

క్రమంగా అన్ని ముఖ్య దేశాలలోనూ ప్రారాసాను అధికారంలోకి తీసుకురావడం ద్వారా  యుధ్ధాలను నివారించి ప్రపంచ శాంతిని తీసుకువస్తామన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభ తీర్మానించాలని ఆర్డర్ లాంటి విజ్ణప్తి చేశారు. సరే ఆ తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత బలపరిచారు. మహారాష్ట్ర గవర్నర్ సంతోష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా  బలపరచారు. ఆ వెంటనే సభ తీర్మానం ఆమోదించింది. అంతే ఆఘమేఘాల మీద తీర్మానం ఆమోదం పొందిందని ఇక నుంచీ భారాస ప్రరాసా అయిపోయిందని కేసీఆర్ ప్రకటించారు. 

త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యా బలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్య  ప్రకటించారు.

ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయులలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తాయి. ప్రరాస అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. మాది ఫ్రీ కంట్రీ అనీ ఎవరైనా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు.  రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా స్పందన తెలియరాలేదు. ఐరాస సెక్రటరీ జనరల్ మాత్రం ఐరాస కాలం చేసిందని భారత ప్రధాని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు.  ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని ఐరాసలో భారత ప్రతినిధి ఉద్ఘాటించారు.  ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్ద పెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధాన రహదారులూ గల్లీలు అన్న తేడా లేకుండా   ర్యాలీలతో హోరెత్తుతున్నాయి.  దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో   దేశం అంతా మార్మోగింది. 

(కేవలం సరదాగా..)

By
en-us Political News

  
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.