తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో గెలిచి ఇన్ని సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటికి నేతలకు పూర్తి స్థాయిలో వారి పోస్ట్లు భర్తీ కాలేదు .రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. కొంతమందికి మాత్రమే ఆ పదవులిచ్చారు. మిగతా ఆశవాదులు ఆ పదవుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్నయి. నామినేటెడ్ పదవుల భర్తీ దసరాలోపు ఉండొచ్చనే చర్చ టీఆర్ ఎస్ పార్టీలో జరుగుతోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లోనే ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
మంత్రి పదవులు దక్కక నిరుత్సాహానికి లోనైన ఎమ్మెల్యేలు కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు సైతం హోదా కోసం ఏదో ఒక పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక మొదటి నుంచి టిఆర్ఎస్ జెండా మోసే నాయకులూ తమకెప్పుడు అవకాశం దక్కుతుందని నిరీక్షిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో చాలా మంది నేతలు కేటీఆర్ చాంబర్ కు క్యూ కట్టారు. త్వరలోనే అన్ని పదవులు భర్తీ చేస్తామని అప్పట్లో ఆయన హామీ ఇవ్వడంతో తమకు పదవులు దక్కుతాయని ఆశల పల్లకిలో వారిప్పుడు ఊరేగుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన శాసన సభ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పార్టీ టికెట్ దక్కని నేతలుకు తగిన పదవిచ్చి గౌరవిస్తామని టీఆర్ఎస్ హైకమాండ్ హామీ ఇచ్చింది.
అలాగే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కని సీతారాం నాయక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జూపల్లి క్రిష్ణరావు, తుమ్మల నాగేశ్వర్ రావు తో సహా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితర నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. వీరేగాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రతాపరెడ్డి లాంటి నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లుగా ఉన్న నేతల్లో కొందరు పదవీ కాలం ముగియగా మరి కొందరిది త్వరలోనే పూర్తి కానుంది. దీంతో రెన్యువల్ కోసం సదరు నేతలంతా కేటీఆర్ ను కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఒకవేళ పోస్టుల భర్తీ చేస్తే పదవులు దక్కని నేతలు అసంతృప్తికి లోనవుతారనే భయం టీఆర్ఎస్ లో నెలకొనదని చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే నామినేటెడ్ పదవులకు భర్తీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నిక, మరోవైపు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ తప్పకుంటుందని గులాబి వర్గాలంటున్నాయి. మరి ఈ నామినేటెడ్ పోస్టులు ఎప్పటికి దక్కుతాయి అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nominated-posts-heats-up-politics-in-telangana-25-89747.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.