Publish Date:Apr 26, 2022
ఆంధ్రప్రదేశ్ లో అందరి పరిస్థితీ ఆగమాగమే! ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు. ఉద్యో్గమున్న వేతనం సమయానికి వస్తుందన్న భరోసా లేదు. పేదలకు రేషన్ ఏ నెలకా నెల అందుతుందన్న ధీమా లేదు. ఈ నెల రేషన్ కోత ఇప్పటికే చెబుతున్నారు. ఇలా జగన్ సర్కార్ తన ఆర్థిక అవకతవకల కారణంగా అన్ని వర్గాలనూ ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
వర్సిటీ సిబ్బంది అయితే రెండు నెలలుగా వేతనాలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని నడిపేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలందకుంటే ఎలారా బాబూ అని ఆవేదన చెందుతున్నారు.
వర్సిటీలో యూజీసీ స్కేళ్ల ప్రకారం వేతనాలు అందుకునే వారి పరిస్థితి బానే ఉంది. అయితే మిగిలిన మినిస్టీరియల్ సిబ్బంది పరిస్థితే దయనీయంగా ఉంది. వారికి ఇప్పటికీ మార్చి వేతనాలు అందలేదు. ఏప్రిల్ నెల చివరికి వచ్చేసింది. ఇంకా మొదటి ఏప్రిల్ మొదటి తారీకుల అందాల్సిన జీతాలకు అతీగతీ లేదు. ఎందుకు ఆలస్యం అయ్యింది, ఎప్పుడిస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే నాథుడే లేడు.
వీరి జీతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి కారణంగా చెప్పి గత నెల వేతనాలకు ఇంత వరకూ ఆమోద ముద్ర వేయలేదు. వేతనాలు ఇవ్వకపోవడానికి అదే కారణమని చెబుతున్నారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల విషయంలో పెద్ద పట్టింపు చూపుతున్నట్లుగా తోచదు. ఇప్పటికే హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలకు గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ ను తగ్గించింది. ఉద్యాన వర్సిటీకి రూ.10 కోట్లు, వెటర్నర వర్సిటీకీ రూ.15 కోటు చొప్పున తగ్గించింది. ఇక ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామంటూ ఘనంగా ప్రకటించిన మత్స్య వర్సిటీకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు. అంటే ఆ వర్సిటీ తరగతుల ప్రారంభం ఈ ఏడాది హుళక్కే అని అర్ధమౌతున్నది. కేటాయింపుల్లో కోతలు, వేతనాలకు ఆమోదముద్ర వేయకుండా వర్సిటీల సిబ్బందిని ఇబ్బందుల పాలు చేస్తున్నది. వెంటనే వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన బాటపడతామని సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-salaries-to-varsity-staff-from-two-months-39-134969.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.