Publish Date:Apr 26, 2022
రూ.3.30 లక్షల కోట్లకు ట్విటర్‌ను కొనుక్కున్నారు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ముందుగా పెట్టుబడుల రూపంలో ట్విటర్‌లో 9 శాతం వాటా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత తెలిసింది.. ట్విటర్‌లో వాక్ స్వేచ్చ అనుకున్నంత లేదని. ఇలా అయితే కంపెనీ పురోగతి కష్టమని భావించారు. ట్విటర్‌ను నడపడం మీ వల్ల కాదంటూ.. మొత్తం తానే కొనుక్కుంటానంటూ యాజమాన్యానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొదట అలా కుదరదు.. అమ్మేదేలేదంటూ ట్విటర్ బోర్డు మొండికేసింది. పరోక్షంగా పూర్తి వాటాలు సొంతం చేసుకునేలా మస్క్ పావులు కదుపుతున్నారని తెలిసి.. ఇక అతనితో మనకెందుకులేనని.. ట్విటర్‌ను గంపగుత్తగా మస్క్‌కు అమ్మేసేందుకు ముందుకొచ్చింది యాజమాన్యం. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున.. మొత్తం 46.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్లు)కు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో 100శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నారు ఎలాన్ మస్క్.
ఫేస్‌బుక్, టిక్‌టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లు ఉన్నప్పటికీ, ప్రముఖ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావి వర్గం అకౌంట్స్‌తో ట్విటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. వాక్ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే కంపెనీలో పెట్టుబడులు పెట్టానని, కాకపోతే ప్రస్తుత స్థితిలో కంపెనీ వాక్ స్వేచ్ఛను పెంచకపోవడమే కాదు, కల్పించనూ లేదని పెట్టుబడులు పెట్టాక నాకు అవగతమైందంటూ ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు ఇటీవల మస్క్ లెటర్ రాశారు. లిస్టెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకే సంస్థను పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. అనుకున్నట్టుగానే అతితక్కువ సమయంలోనే ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అందుకు కావలసిన నిధులను బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సమీకరించారు. టెస్లా అధినేత మస్క్ ట్విటర్‌ను కొంటున్నారనే సమాచారంతో.. స్టాక్ మార్కెట్లో ట్విటర్ షేరు ధర అమాంతం పెరిగిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elon-musk-bought-twitter-39-134976.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.