వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో 2019 ఆగస్టులో జరిగిన విలేకరి హత్య కేసులో దాడిశెట్టి రాజా నిందితుడు. హతుడు సత్యనారాయణ 2019 ఆగస్టు 15న అన్నవరంలోని తన నివాసానికి వెళుతుండగా లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు.
ఆ హత్య సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజా అంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు దాడిశెట్టి రాజాతో పాటు మరో ఆరుగురిపై చార్జిషీట్ నమోదు చేశారు. అయితే జగన్ అప్పట్లో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో దాడిశెట్టి రాజాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దాడిశెట్టి రాజీ మంత్రి అయిన తరువాత ఆయనపై ఉన్న కేసు ముందుకు సాగలేదు. 2023లో దాడిశెట్టి రాజా పేరును చార్జిషీట్ నుంచి తొలగించారు.
దీంతో హతుడు సత్యనారాయణ సోదరుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత తప్పకుండా న్యాయం చేస్తానని అప్పట్లో లోకేష్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరును చార్జిషీట్ లో నమోదు చేశారు. దీంతో దాడిశెట్టి రాజీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. ఇక దాడిశెట్టి రాజా అరెస్టు లాంఛనమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-respite-to-former-minister-dadisetti-raja-in-high-court-25-187897.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.