నేను ముసలోడిని అయిపోయాను: పోటీ చేయాలనే ఆలోచన లేదు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.!

Publish Date:Oct 3, 2026

Advertisement

పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. బండ్లగూడలోని ఫాతిమా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ తన రాజకీయ ప్రస్థానం, విద్యాభ్యాసం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వయస్సును ప్రస్తావిస్తూ.. “నేను ముసలోడిని అయిపోయాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ వ్యాఖ్యానించారు. అదే కార్యక్రమంలో తన విద్యాభ్యాసం గురించి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే రాజకీయాల్లో తాను ఎదిగిన తీరును ప్రస్తావిస్తూ.. “నేను 12వ తరగతి చదువుకున్నాను.. కానీ నేను ఏం చెప్పినా దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను” అని పేర్కొన్నారు. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటూ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని వివరించారు. అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎంఐఎం అధికారిక వివరాల ప్రకారం, ఆయన 1999 నుంచి చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఆ తర్వాత కూడా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 

పాతబస్తీలో ఎంఐఎం రాజకీయాల్లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలోనూ వివిధ ఎన్నికల సందర్భాల్లో ఎంఐఎం తరఫున ఆయన కీలకంగా వ్యవహరించారు. 2026లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసలు చర్చ అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో నిజంగానే పోటీకి దూరంగా ఉంటారా? అన్నదే. ఒకవేళ ఆయన ఎన్నికల బరిలోకి దిగకపోతే చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం ఎవరిని బరిలోకి దింపుతుంది? కొత్త తరానికి అవకాశం ఇస్తుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే “వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ స్వయంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు ఆయన రాజకీయ వారసత్వం, మరోవైపు కొత్త తరానికి అవకాశాలపై చర్చ మొదలవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాంద్రాయణగుట్ట రాజకీయాలు ఎలా మారతాయన్న ఆసక్తి నెలకొంది.

 

 

 

[ Akbaruddin Owaisi, AIMIM Party, Chandrayangutta Constituency, Asaduddin Owaisi,  old city, CM Revanth reddy, Telangana Assembly,  GHMCElections,Telugu News, Telugu One ]

By
en-us Political News

  
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.