రాజీలే.. నామాలు లేవు!

Publish Date:Jun 9, 2025

Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, చివరాఖరుకు జరగనే జరిగింది. ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. మారో మూడు ఖాళీలు ఆశావహుల కోసం రిజర్వులో ఉంచారు. అయినా..  మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు సహజంగానే భగ్గుమన్నారు. రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే.. ప్రస్తుత్తానికి  అలాంటి ముప్పేమీ లేదని బుజ్జగింపులతో అంతా సర్దుకుందని  పార్టీ వర్గాల సమాచారం. అలాగే.. ఇంకా చిన్న చిన్న పొరపొచ్చాలు మిగిలి ఉన్నా..  అధిష్టానం జోక్యంతో అన్నీ సర్డుకుంటాయని మంత్రివర్గ విస్త’రణం’ సృష్టించిన సంక్షోభం టీ కప్పులో తుపానులe సమసి పోతుందని కాంగ్రెస్ పెద్దలు విశ్వాసంతో ఉన్నారు. 

అయితే..  ఇతరుల విషయం ఎలా ఉన్నా, మంత్రి పదవి కోసమే ఇటు నుంచి అటు,  అటు నుంచి ఇటూ  కాంగ్రెస్, బీజేపీ గోడలు దూకిన కోమటి రెడ్డి,  మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని, హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల ప్రాతినిధ్యం కోసం చాలా కాలంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మల్ రెడ్డి రంగా రెడ్డి, అలాగే..  నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి  సుదర్శన్ రెడ్డి  కొంచెం గట్టిగానే అసంతృప్తిని వ్యక్త పరిచారు.  ముగ్గురికి ముగ్గురూ రాజీనామా ఆస్త్రాన్ని సందించారు. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ హారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఒకరిద్దరు  మంత్రులు రంగంలోకి దిగి, ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి బుజ్జగించారు. ఆ విధంగా ప్రస్తుతానికి అయితే.. ఆల్ ఈజ్ వెల్  అన్నట్లు అంతా బాగుందనే  పిక్చర్ ఇచ్చారు. 

అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా..  మంత్రి వర్గ విస్తరణ సృష్టించిన సంక్షోభం నిజంగానే టీ కప్పులో తుపానులా సమసి పోయిందా? పోతుందా? అంటే..  లేదు.  నిజానికి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంత సులభంగా చల్లారదు. నిత్యాగ్ని హోత్రంలా  నిత్యం  రగులుతూనే ఉంటుందని పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అవపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ముఖ్యంగా..  రాహుల్ గాంధీ కులగణన జెండా ఎత్తిన నేపధ్యంలో  పార్టీలో క్యాస్ట్ ఈక్వేషన్స్  ముందు ముందు మరింతగా మారి పోవచ్చని అంటున్నారు. ఇంత వరకు పార్టీలో కొనసాగుతున్న అగ్రకుల ఆధిపత్యానికి గండి పడే సంకేతాలు కనిపిస్తున్న నేపధ్యంలో..  రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి అంత తేలిగ్గాచల్లారక పోవచ్చని  అంటున్నారు. మరోవంక త్వరలో చేపట్టే క్యాబినెట్‌ విస్తరణలో మరో మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. అందులో ఒకటి రాష్ట్ర జనభాలోనే 40 శాతం పైగా ఉన్న,  రాష్ట్ర ఆదాయంలో ఇంచుమించుగా సగం  వాటా  ఇస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు కన్ఫర్మ్ చేస్తు న్నట్లు చెప్పారు. 

అయితే.. పీసీసీ చీఫ్  త్వరలోనే మరో మంత్రి వర్గ విస్తరణని హామీ ఇస్తున్నా..   సంవత్సరంన్నరగా సాగుతున్న. విస్తరణ ప్రహసనం,  ప్రస్తుత అనుభవాల దృష్ట్యా..  ఇప్పట్లో మరో విస్తరణ ఉండక పోవచ్చని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి.  అదీ గాక.. ఒక వేళ పీసీసీ చీఫ్ చెప్పినట్లుగానే త్వరలో’  మంత్రి వర్గ విస్తరణ ఉన్నా..  సీరియస్ గా మంత్రి పదవి ఆశిస్తున్న  ముగ్గురూ, సుదర్శన్ రెడ్డి, రాజ గోపాల రెడ్డి, మల్రెడ్డి రంగా రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..  ముగ్గురిలో ఇద్దరికి మొండి చేయి తప్పదని అంటున్నారు. ఈ నేపధ్యంలో, భంగపాటుకు గురైన వారిలో  ఎవరేమి చేస్తారు, ముఖ్యంగా హోం మంత్రి కావాలని కలలు కన్న రాజగోపాల రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.  

అదలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ  ఆశావహులనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కొందరు  ముఖ్య  నాయకులకు కూడా రుచించలేదని,  అంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కొక కులం నుంచి ఒక్కొకరు చొప్పున ప్రతిపాదించిన ఆరేడు పేర్లలో ఒక్కరికీ బెర్త దక్కలేదని అంటున్నారు. ముఖ్యంగా, సుదర్శన్ రెడ్డి ఒక్కరికన్నా అవకాశం ఇవ్వాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి క్షణం వరకు గట్టి ప్రయత్నాలు చేశారని, అయినా అధిష్టానం నో చెప్పిందంటున్నారు. అందుకే  ప్రస్తుతానికి, ఆశావహులతో పాటుగా, ముఖ్య నేతలు  రాజీ పడినా, భవిష్యత్ లో పరిస్థితులు ఎలా మారాతాయో చెప్పలేమని అంటున్నారు.

By
en-us Political News

  
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఇది కేవలం ఒక శాఖపై ఉన్న ఆసక్తి మాత్రమే కాదు.. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారి అద్భుత వారసత్వం. నౌపాడ - గుణుపూర్ నారోగేజ్ లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం, విశాఖపట్నం నుంచి పలాస, భువనేశ్వర్ వరకు కొత్త మెమో రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు అనుసంధానతను పెంచడంలో ఎర్రన్నాయుడు గారు చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.