అమరావతి రైతులు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకు జగన్ ను, ఆయన మూడు రాజధానుల సిద్ధాంతాన్నీ తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించిన వారే నేడు తమ సమస్యల పరిష్కారం కోసం అదే గడప తొక్కడం ఏంటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.
వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు సుదీర్ఘ కాలం పాటు రోడ్లెక్కి నిరసనలు ప్రదర్శించారు. జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం (జూన్ 2) జగన్- అమరావతి రైతుల భేటీ జరిగింది. అయితే.. గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాలు, పాదయాత్రలు చేసిన పాత అమరావతి రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భేటీలో లేరు. వీరంతా ‘కొత్త రైతులు’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్న రైతుల్లో కొందరు తమకు అన్యాయం జరుగుతోందంటూ జగన్ వద్దకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ లోపలా, వెలుపలా గళం విప్పాలని.. తమ పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు జగన్ ను కోరారు. వీరిలో అత్యధికులు నాడు భూ సమీకరణను వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం. మొత్తం మీద కొత్త రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati-farmers-meet-with-jagan-39-221620.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.