ప్రాజెక్టులు పడక.. అభివృద్ధి మునక.. జగన్ హయాంలో జరిగిందిదేనా?

Publish Date:Aug 12, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొత్తూరులో ముగిసింది. కొత్తూరులో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. ఆ జనవాహిని పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు కోసం జనం కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

   జనసందోహాన్ని చూస్తే  ముఖ్యమంత్రికి గుండె ఆగిపోతుందేమోనని చంద్రబాబు అన్నారంటూ తెలుగుదేశం అంచనాలకు మించి ఆ సభకు జనం హాజరయ్యారని ఇట్లే అవగతమౌతుంది. అయితే పరిశీలకులు మాత్రం అధికారంలోని జగన్ సర్కార్ పై చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ ఏకకాలంలో చేస్తున్న ముప్పేట దాడితో ఇప్పటికే వైసీపీ గుండె శ్వాస ఆగిపోయినట్లుగా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు, విసురుతున్న సవాళ్లకు అధికారం పార్టీ నుంచి ఎటువంటి  సమాధానం రావడం లేదు. ఎంత సేపూ విమర్శలకు సాహానం ఇవ్వకుండా, సవాళ్లకు స్పందించకుండా ఎదుటి వారి పై దూషణలతో సరిపుచ్చేయడమంటే.. విపక్ష నేతలు ప్రస్తావిస్తున్న సమస్యలు, సవాళ్లకు వారి వద్ద జవాబు లేదని భావించాల్సి వస్తోందని అంటున్నారు.

 పుంగనూరులో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు మాత్రం చంద్రబాబు సహా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా కోనసీమలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ  జగన్ తెలుగుదేశం వాళ్లు అధికారంలోకి వస్తే తనను ఖతం చేస్తానంటున్నారంటూ జనం ముందు దీన స్వరంతో ఆవేదన వ్యక్తం  చేశారు.

ఒక వైపు చంద్రబాబు తన యాత్ర ద్వారా రాష్ట్రంలో జగన్ హయాంలో ప్రాజెక్టులు ఎలా పడకేశాయో, రైతులు ఎలా నష్టపోయారో వివరిస్తుంటే.. వాటికి సమాధానాలు చెప్పడం మాని  ఆరోపణలు, విమర్శలు, దూషణలకే ముఖ్యమంత్రి పరిమితం కావడం ద్వారా.. ఈ నాలుగేళ్లలో త  ప్రగతి, అభివృద్ధి విషయంలో తన ప్రభుత్వం చేసింది ఇదీ అని చెప్పుకోవడానికేమీ లేదని పరోక్షంగా అంగీకరించడమేనని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.