మద్యం అమ్మకాలతో 30 వేల కోట్ల అక్రమార్జన.. పవన్ ఆరోపణకు సమాధానం చెప్పు జగన్!

Publish Date:Aug 12, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  మద్యం అమ్మకాల్లో నేరుగా వైసీపీ అగ్ర నేతకే లాభం చేకూరుతోందంటూ చేసిన విమర్శలను ఖండించేందుకు ఆ పార్టీ నేతలెవరూ సాహసించని పరిస్థితిని చూస్తుంటే పవన్ వి కేవలం ఆరోపణలు మాత్రమే కాదన్న నిర్ధారణకు రావలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వ  పెద్దలు అక్రమంగా 30 వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారంటూ జనసేనాని చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  మద్యం అమ్మకాలలో డిజిటల్ ట్రాన్సాక్షన్ కు అవకాశం లేకుండా చేసి కేవలం నగదు చెల్లించే మద్యం కొనుగోలు చేయాలన్న షరతునకు వెనుక ఉన్న కారణం ఇదేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. విమర్శలకు తలొగ్గి డిజిటల్ చెల్లింపులకు కూడా ఓకే  అని ప్రభుత్వం చెప్పినా.. వాస్తవంగా మాత్రం ఏపీలోని మద్యం దుకాణాలలో కనీస శాతంలో కూడా నగదు లావాదేవీలకు అవకాశం లేని పరిస్థితే ఉంది. అక్రమంగా సొమ్ములు వెనకేసుకోవడానికే మద్యం అమ్మకాలలో నగదు  చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు లెక్కలతో సహా పవన్ కల్యాణ్ మద్యంలో వైసీపీ పెద్దల అక్రమార్జన  ఏ స్థాయిలో ఉందో చెప్పడంతో.. 
జనం విస్తుపోతున్నారు. నల్ల ధనాన్ని వెలికి తీయడమే లక్ష్యం అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ దారిలో ఎన్ని అడగులు వేశారో కచ్చితంగా చెప్పలేం కానీ, నల్ల ధనాన్ని అరికట్టడానికి అంటూ ఆయన పెద్ద నోట్లను రద్దు చేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే పారదర్శకత ఉంటుందని దానిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా దాదాపుగా లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగే పరిస్థితి వచ్చింది. ఏపీలో అదీ ఒక్క మద్యం అమ్మకాల విషయంలో మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక అంటరాని వ్యవహారంగా పరిగణింపబడుతోంది.  ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడానికే నగదు లావాదేవీలు మాత్రమే అంటూ మద్యం విధానాన్ని జగన్ అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లధనంపై ఉక్కు పాదం అంటూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రసంగాలు చేస్తూ.. తన హయాంలో అక్రమార్జనకు తావులేకుండా పోయిందని ఘనంగా చెప్పుకునే ప్రధాని మోడీ.. ఏపీలో మద్యం అమ్మకాలలో జరుగుతున్న అడ్డగోలు అక్రమాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 
అయితే ఇక్కడ పవన్ మాత్రం కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రశ్నించడం లేదు... ఆయన ద్వంద్వ ప్రమాణాలను వేలెత్తి చూపడం లేదు. పైపైచ్చు ఆయన సహకారంతోనే అంటే కేంద్రం సహకారంతోనే జగన్ ఆటకట్టిస్తానంటున్నారు. సరే అది పక్కన పెడితే.. మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టడం లేదనీ, ఒక్క రూపాయి కూడా అక్రమార్జనకు అవకాశం లేదనీ వైసీపీ గట్టిగా చెప్పలేకపోతోంది. అలా చెబితే నగదు లావాదేవీలను ఎందుకు అంగీకరించడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కనుకనే పవన్ అయినా, మరెవరైనా సరే ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించినా, ప్రశ్నించినా లైట్ తీసుకుని వదిలేస్తోంది.  ఇక జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ హయాంలో కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచి.. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయనీ, జగన్ విధానాల కారణంగా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేకపోగా.. పొరుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా లబ్ధి పొందుతున్నాయనీ సోదాహరణంగా వివరిస్తున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో పని చేస్తున్న పరిశ్రమలు కూడా విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అమరరాజా బ్యాటరీ పరిశ్రమను ఉదహరిస్తున్నారు. లూలూ పరిశ్రమ ఏపీలో వ్యాపారం చేయలేమంటూ పారిపోవడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   

By
en-us Political News

  
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.