కామారెడ్డి లో మరోసారి స్పష్టమైన తీర్పుఖాయం
Publish Date:Mar 9, 2012
Advertisement
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గ ఓటర్లు ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ స్పష్టమైన తీర్పులే ఇచ్చారు. తమకు సేవ చేయగలడు అనుకుంటున్న నాయకులకు గణనీయంగా ఓట్లు వేశారు. అత్యల్ప మెజారిటీలు ఇక్కడ అసలు కనిపించవు. అలాగని భారీ మెజారిటీలు కూడా ఉండవు. 1983లో తెలుగుదేశం ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్ధి పార్శిగంగయ్య సుమారు 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985లో టిడిపి అభ్యర్ధి ఎ. కృష్ణమూర్తి, 28,511 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీర్ అలీ సుమారు 7వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994 లో గంప గోవర్ధన్ 41వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి యూనఫ్ అలీ 4వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో షబ్బీర్ అలీకి 52వేల ఓట్ల మెజారిటి వచ్చింది. గత ఎన్నికల్లో గంప గోవర్ధన్ 47 వేట ఓట్ల మెజారిటితో గెలుపొందారు.
http://www.teluguone.com/news/content/nizamabad-24-12506.html





