మియాపూర్‌లో నవవధువు ఆత్మహత్య
Publish Date:Apr 3, 2026
Advertisement
కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరా బాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన యువతి చివరకు నిరాశతో బలవన్మరణానికి పాల్పడింది. అత్తారింటికి వెళ్లిన కూతురు సంతోషంగా ఉందని ఆనందపడిన తల్లిదండ్రులను ఆమె మరణ వార్త సోక సంద్రంలో ముంచేసింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మక్త మహబూ బ్‌పేట్‌లోని అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. ఇద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇటీవల అదనపు కట్నం కోసం భర్త వేధిపులు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇరువురి మధ్యా తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/newly-married-woman-commits-suicide-36-216603.html





