బండ్ల గణేష్ కు సుప్రీం లో చుక్కెదురు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

టాలీవుడ్  నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.  తన కుటుంబానికి చెందిన    స్థిరాస్తి వేలం విషయంలో సుప్రీం కోర్టు బండ్ల గణేష్ పిటిషన్ ను తోసి పుచ్చింది.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే.  అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.  

విషయమేంటంటే..  హైదరాబాద్‌లోని   శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనియన్ బ్యాంకులో తీసుకున్న  భారీ రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన తండ్రి,   సోదరుడు కలసి తమ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్ స్థిరాస్తిని వ్యక్తిగత పూచీకత్తుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తాకట్టు పెట్టారు.  రుణ చెల్లింపుల ప్రక్రియ సరిగ్గా సాగకపోవడంతో బ్యాంక్ అధికారులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. 2019వ సంవత్సరంలో సర్ఫేసీ చట్టం  కింద సదరు జూబ్లీహిల్స్ ఆస్తిని బ్యాంక్ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2022లో వేలం నిర్వహించి   8.51 కోట్లకు ఆ ఆస్తిని విక్రయించింది.

బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను  వ్యతిరేకిస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఎన్ సీఎల్ టీ)  ఆశ్రయించారు. ఎన్సీటీఎల్ లో కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ  కొనసాగుతున్న సమయంలో తమ పూచీకత్తు ఆస్తిని వేలం వేయడం చట్ట విరుద్ధమని బండ్ల గణేష్ వాదించారు. పైగా.. వన్ టైమ్ సెటిల్‌మెంట్  కింద తమ కుటుంబం ఇప్పటికే రూ. 71.44 కోట్లతో కలిపి మొత్తం సుమారు రూ. 129.02 కోట్ల బకాయిలను బ్యాంకుకు చెల్లించిందనీ.. బకాయిలన్నీ తీరిపోయాక కూడా ఆస్తిని వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు.   ఈ వాదనలతో  ట్రిబ్యునల్  బండ్ల గణేష్‌కి అనుకూలంగా తీర్పునిస్తూ వేలాన్ని రద్దు చేసి, ఆస్తిని తిరిగి అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.

అయితే ఆ ఆదేశాలను సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య మరియు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారించింది. బ్యాంకు తరఫున వాదనలు వినిపిస్తూ, ఎన్సీఎల్టీలో కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై ఆటోమేటిక్‌గా మారటోరియం రక్షణ వర్తించదని స్పష్టం చేశారు. ఈ వాదనలను ఆమోదించిన తెలంగాణ హైకోర్టు, డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను  రద్దు చేస్తూ యూనియన్ బ్యాంక్ చేసిన ఆస్తి వేలం చట్టబద్ధమైనదేనని సమర్థించింది. హైకోర్టు తీర్పును బండ్ల గణేష్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా   హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ..బండ్ల గణేష్ పిటిషన్ ను కొట్టివేసింది. 

Jubilee Hills Property Auction, Union Bank Of India Loan Case, Bandla Ganesh Court Case, Telangana High Court Order

By
en-us Political News

  
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.