ఐఎఎస్ అధికారుల వైఖరిపై ద్వివేది వ్యాఖ్యలు

Publish Date:Feb 4, 2012

Advertisement

న్యూఢిల్లీ: ఐఏఎస్‌ల రక్షణ కోసం చాలినన్ని నిబంధనలు ఉన్నాయని నిబంధనల ప్రకారం పని చేస్తే.. ఎలాంటి సమస్యలూ ఎదురు కావని, ఈ ఉద్యోగంలో బిజినెస్ రూల్స్‌ను అనుసరించి పనిచేసే ఎవరూ ఏ భయాలూ పెట్టుకోవాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది ఐఎఎస్ అధికారుల వైఖరిపై వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా ఎవరినైనా సీబీఐ హింసిస్తోందని నేను అనుకోవటం లేదని ఆయన అన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకుని ఆయన ప్రశ్నించారు. కేవలం ఇద్దరు ఐఏఎస్ అధికారులు.. శ్రీలక్ష్మి, బి.పి.ఆచార్య మాత్రమే జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దిగజారదని, రాష్ట్ర ప్రతిష్ఠ సమున్నతంగా ఉందని, రాష్ట్ర కేడర్ దేశంలోనే గొప్ప వాటిలో ఒకటని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ద్వివేదీ ఏపీ భవన్‌లో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిని ఐఏఎస్ అధికారులు కలిసి అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు తీరు మీద ఆందోళన వ్యక్తం చేసిన అంశంపై పంకజ్ ద్వివేదీ స్పందించారు. ఐఏఎస్‌లు కొందరు తనను కూడా గురువారం కలిశారని ఆయన చెప్పారు.

సీబీఐ విచారణల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కొందరు అధికారులు అంటున్నారని, సీబీఐ విచారణ సందర్భంగా హింసిస్తున్నారన్న కొందరు ఐఏఎస్‌లు అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని, నిబంధనల ప్రకారం పని చేస్తే ఎలాంటి సమస్యలూ ఎదురు కావని ఆయన చెప్పారు. "ఎవ్వరూ మనోనిబ్బరం కోల్పోవద్దు. న్యాయ వ్యవస్థపై మనకు విశ్వాసం ఉండాలి. దానికంటే ముందు మనం చేస్తున్న సేవపై మనకు నమ్మకం ఉండాలి. వ్యక్తికంటే వ్యవస్థ ఎప్పుడూ గొప్పది'' అని ఐఏఎస్ అధికారులకు పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.