రాజకీయ వర్గాల్లో చర్చ ఢిల్లీలో బొత్స బిజీ బిజీ
Publish Date:Dec 20, 2011
Advertisement
న్యూఢిల్లీ: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో పలువురు నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు. గత వారంలో ఐదురోజుల పాటు ఢిల్లీలో గడిపిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మళ్ళీ వారం తిరక్కముందే ఢిల్లీలో ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి బొత్స ఢిల్లీ వచ్చారు. ఏఐసీసీ సీనియర్ నేత ఒకరితో ఆయన దాదాపు అరగంటకు పైగా లాబీలో చర్చలు జరిపారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావు ఈ సమావేశానికి సంధాన కర్తగా వ్యవహరించారు. ఢిల్లీలో ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన చిరంజీవితో ఓ హోటల్లో బొత్స చర్చలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా మంతనాలు జరిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/newdelhi-24-10099.html
http://www.teluguone.com/news/content/newdelhi-24-10099.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





