Publish Date:Apr 15, 2022
జైభీమ్ భారత్ పార్టీ. పేరు చూస్తూనే తెలిసిపోతుంది ఇది దళిత పార్టీ అని. ఇక ఈ పార్టీ పెట్టింది కూడా ఏ మామూలు వ్యక్తో కాదు. ఏపీ హైకోర్టులో జగన్‌ను, వైసీపీ సర్కారును కేసులతో ముప్పుతిప్పలు పెడుతున్న జడ శ్రవణ్ కుమార్. ఈ పేరు వింటేనే జగనన్నకు ఝలక్. అలాంటి శ్రవణ్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం జగన్‌రెడ్డికి షాకింగ్ పరిణామమే. అందుకే, వైసీపీ అధినేతలో కలవరం పెరిగిపోయిందని అంటున్నారు. పార్టీ ఆరంభ ప్రసంగంలోనూ.. జగన్‌ను, వైసీపీనే టార్గెట్ చేయడంతో.. ఇక ముందుముందు అధికార పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులను ఏకం చేయడంలో జైభీమ్ భారత్ పార్టీ-జేబీపీ ముందుంటుందనే టెన్షన్ ముఖ్యమంత్రిని ఉలిక్కిపడేలా చేస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందని.. దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదని జడ శ్రవణ్ కుమార్ అన్నారు. దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్.. ఆ తరువాత చేసిన అన్యాయం ఎవ్వరూ మర్చిపోరని.. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వైసీపీలోని దళిత నాయకులను ఓడించేందుకే ఈ పార్టీ పెడుతున్నట్టు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. 26 రకాల దళిత స్కీమ్‌లను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. ఓడిపో.. ఓడించు.. గెలువు.. అనే కాన్షీరామ్ మాటలు తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ చెప్పారు. శ్రవణ్ మాటలు జగన్‌కు ముచ్చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
జడ శ్రవణ్ కుమార్. 28ఏళ్లకే న్యాయమూర్తి అయ్యారు. పదేళ్లు జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా మారి.. ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం కోర్టు కేసులతో జగన్ సర్కారును ముప్పుతిప్పలు పెడుతున్న లాయర్లలో ఆయన ముఖ్యమైన వారు. అమరావతి కోసం రాజధాని రైతుల కేసులు, విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసుల్లో బాధితుల తరఫున వాదించారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా.. అన్యాయం జరిగినా.. హైకోర్టులో కేసులతో వారికి అండగా నిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఆయన కోర్టులో పిటిషన్లు వేశారు. అలాంటి జడ శ్రవణ్ కుమార్.. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు, అవినీతి లేని పాలన కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్టు.. జీబీపీని ప్రకటించి ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు రేపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-political-party-in-ap-39-134436.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.