Publish Date:Apr 15, 2022
మంత్రి పదవి పోయిన తరువాత తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తన వింతగా ఉంది. ఆయన మాటల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంతకూ అనిల్ కుమార్ తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు అనిత్ కుమార్ టార్గెట్ చేసింది మంత్రి కాకాణినా.. ముఖ్యమంత్రి జగన్ నా?.. అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ వైఎస్ జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడు. మూడేళ్ల పాటు మంత్రిగా ఉంటూ ఓ ఊపు ఊపారనే చెప్పాలి. జగన్ కేబినెట్ లో బూతుల మంత్రి జాబితాలో అనిల్ కూడా ఒకరు. చంద్రబాబు, లోకేష్ ను తెగ విమర్శలు చేసిన అనిల్ కుమార్ మంత్రి పదవి పోయిన తరువాత సొంత పార్టీ నేతలపైనే గుస్సా అవుతున్నారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటికి రెండింతలు రిటన్ గిఫ్ట్ లు ఇస్తా అంటూ విరుచుకుపడ్డారు. సొంత పార్టీ మంత్రిపై అనిల్ చేసిన కామెంట్లు అదిష్టానాన్ని ఇరుకున పెట్టాయంటున్నారు. జగన్ కు వీర విధేయుడిగా చెప్పుకుంటున్న అనిల్ ఇలా మాట్లాడటం వెనుక మంత్రి పదవి పోయిందన్న కోపం బట్టబయలవుతోందంటున్నారు.
కొత్త మంత్రి కాకాణిపై అనిల్ కామెంట్స్ చేసిన మరుసటి రోజే.. నెల్లూరు సిటీలో అభిమానులు ఏర్పాటు చేసిన కాకాణి ప్లెక్సీలలను గుర్తు తెలియని వారు తొలగించారు. అయితే ఈ పని అనిల్ వర్గమే చేసిందని కాకాణి మరింత గుస్సాగా ఉన్నారట.
ఇదిలా ఉండగా.. గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డికి.. కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వార్ నడిచింది. అప్పట్లో సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి కొన్ని ఆధారాలు బయటకు రిలీజ్ చేశారు. కాకాణి ప్రవేశపెట్టిన ఆధారాలు నకిలీవని సోమిరెడ్డి కేసుపెట్టడంతో ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే.. ఆ ఆధారాలను గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు నుంచి చోరీ చేశారనే వార్త గుప్పుమంది. నెల్లూరు 1వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో చోరీ ఎపిసోడ్ కాకాణిని ఇరుకున పెట్లినట్లు అయిందని అంటున్నారు.
అయితే.. కాకాణి మంత్రి అయి వారంరోజులు కూడా కాలేదు. ఇంకా ఆయన జిల్లాకు రానేలేదు. అప్పుడే అనిల్ కామెంట్లు, ప్లెక్సీల తొలగింపు, కోర్టులో ఉన్న కాకాణినికి సంబంధించిన డాక్యుమెంట్లు చోరీ.. ఇదంతా ఓ పక్కా ప్రణాళికతో జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చోరీ ఎవరు చేయించి ఉంటారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తతంగం వెనుక కాకాణి పత్యర్దులు ఉన్నారా.. లేక ఆయనే చేయించారా.. లేక కాకాణిని ఇరకాటంలో పెట్టేందుకు మరెవరైనా చేయించారా అనే సందేహాలకు పోలీసు విచారణ మాత్రమే చెక్ పెట్టనుంది.
ఏదేమైనా కాకాణిపై అనిల్ తన వ్యాఖ్యలతో కాకాణిని టార్గెట్ చేశారా? లేక మంత్రి పదవి కొనసాగించలేదని జగన్ నే టార్గెట్ చేశారా అంటూ సొంత పార్టీ నేతలే అనిల్ పై సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anil-target-kakani-or-jagan-39-134433.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.