ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్!

Publish Date:Jun 25, 2026

Advertisement

ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో  తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో  దశాబ్దాల  అనుభవం ఉంది. 1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన  కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఆయన పని చేశారు. ఐబీలో జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ వంటి  హోదాల్లో పనిచేస్తూ దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత విశ్వసనీయమైన అధికారిగా  గుర్తింపు తెచ్చుకున్నారు.

మహేశ్ దీక్షిత్ కెరీర్‌లో  జమ్మూ కశ్మీర్‌ పని చేసిన కాలం అత్యంత కీలకంగా చెప్పవచ్చు.  శ్రీనగర్‌లోని ఐబీ అనుబంధ విభాగం చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఆయన జమ్మూ, కశ్మీర్, లేహ్ ప్రాంతాల భద్రతా కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించారు.  2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో కశ్మీర్ లోయలో శాంతిభద్రతలను కాపాడటంలో   చాలా కీలకంగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం తలెత్తిన  అల్లర్లను అణచివేయడం, సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను  అడ్డుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేయడంలో ఆయన సమర్థవంతంగా పని చేశారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌లను ఛేదించడంలో ఆయన చూపిన చొరవ  భద్రతా వర్గాలలో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.

ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలపై మహేశ్ దీక్షిత్‌కు పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద నెట్‌వర్క్‌లపై నిఘా ఉంచడంలో, వారి స్లీపర్ సెల్స్ కార్యకలాపాలను ముందే గుర్తించి భగ్నం చేయడంలో ఆయనకు   క్షేత్రస్థాయి అనుభవం ఉంది. అదే ఇప్పుడు ఆయనకు  ఐబీ చీఫ్ పదవి దక్కేలా చేసింది.   2022లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ దీక్షిత్, ఆ తర్వాత  2024 సెప్టెంబర్‌లో స్పెషల్ డైరెక్టర్‌గా పదొన్నతి పొందారు. ఇప్పుడు దేశ ఐబీ డైరెక్టర్‌గా  బాధ్యతలు చేపట్టనున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.