జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!

Publish Date:Jun 12, 2026

Advertisement

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ రూట్లో నే నడిచెదరో

ఇది ఒక సినిమాలో పాట.. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మెగా డీఎస్సీని తన హయాంలో ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో తానే కాక్రోచ్ ని అవుతానన్న మాటలూ చూస్తుంటే... ఆయన రూటే సెపరేటు అని నెటిజనులు ఎద్దెవా చేస్తున్నారు. నలుగురికి అవసరమైనది కాకుండా, ఆయనకు ఏది తోస్తే అది చేస్తారనీ, ఎది అనిపిస్తే అది మాట్లాడతారని అంటున్నారు.  2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ  కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన   శైలిలో  ఇసుమంతైనా మార్పు రాలేదు.   ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.  ఆయన మీడియా సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పట్టించుకోకుండా.. ఆవు కథలాంటి ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  

తెలుగుదేశం కూటమి   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  మెగా డీఎస్సీ పై ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాత పల్లవినే వినిపించారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తై..  అభ్యర్థులు  విధుల్లో చేరినప్పటికీ.. పాతచింతకాయ పచ్చడి లాంటి ధోరణిలోనే జగన్  ఆరోపణలు గుప్పించడంపై సొంత పార్టీ నేతలలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఎందుకంటే డీఎస్సీ  నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో జగన్, వైసీపీ చేసిన ఆరోపణలపై  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   పబ్లిక్ డొమైన్‌లో సాక్ష్యాధారాలతో సహా స్పష్టమైన వివరణ  ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పాత ధోరణిలోనే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేయడం గమనార్హం. 

 ఇక జగన్ యువతను ఉద్దేశించి  చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజకీయవర్గాలలోనే విస్మయం వ్యక్తం అవుతున్నది.  నిరుద్యోగ యువత తిరగబడుతుందంటూ.. ఆయన  "ఇది జెన్-జీ , జెన్-ఆల్ఫా, రాష్ట్రంలో కాక్రోచ్‌లు లేస్తాయి.. తాను కూడా కాక్రోచ్ నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను నవ్వుల పాటు చేశాయి. నెటిజనులైతే జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు అంటూ బొద్దింకలను హిట్ నిర్మూలించినట్లే.. జనం జగన్ ను ఛీ కొడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నిటికీ మించి రాజకీయవర్గాలలో జగన్ పరిపక్వతపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఆయన కాక్రోచ్ వ్యాఖ్యలు ఉన్నాయి.  

వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా..  కేవలం  ప్రభుత్వాన్ని దూషించడమే పరమావధిగా పెట్టుకుంటే.. జగన్ ను జనం మరింత దూరం పెట్టడం ఖాయమని పరిశీలుకులు అంటున్నారు.  తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలురపాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధినేత విధానాలను గుడ్డిగా సమర్థించిన కీలక నేతలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వరుసగా వలసలు పోతుంటే, ఉన్నవారైనా వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే నైజం ఆ పార్టీ లీడర్‌షిప్‌లో లోపించిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

తాజా ప్రెస్‌మీట్‌తో వైసీపీ శ్రేణులకు మరియు మిగిలిన నాయకులకు తమ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇదే పంథాను నమ్ముకుని వెళ్తే రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమవుతున్న వైఖరిని గమనించిన తర్వాత, సొంత పార్టీ నేతల్లోనే అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికైనా ఒక నిశ్చయానికి రావడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా, కేవలం ఊహాజనిత ఆరోపణలతో కాలం గడిపితే ప్రజల్లో ఉన్న కనీస ఆదరణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలోనైనా వైసీపీ అధినాయకత్వం ప్రజా క్షేత్రంలోని వాస్తవాలను గ్రహించి ప్రవర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.