మాజీ ఐపీఎస్ అధికారి భార్యను చంపింది నేపాల్ గ్యాంగే.. సీపీ

Publish Date:May 8, 2026

Advertisement

మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు  తేలిందని చెప్పారు. కొన్ని ముఖ్య మైన క్లూస్ లభించాయనీ..  వాటి ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన గురువారం (మే 7) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజాన్ రాయ్  ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి తనూజాను దారుణంగా హత్య చేశారు. ఆమెను చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపి రాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

దుండగులు ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయని భావించి వెనుక గేటు ద్వారా ఇంట్లోకి ప్రవేశించి..  హత్య అనంతరం అదే మార్గం ద్వారా పరార య్యారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నామని, నింది తులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారు సంవత్స రాలుగా పనిచేసినా అప్రమ త్తంగా ఉండాలని సూచించా రు. 

ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటీవల మాజీ డీజీపీ కుటుంబంలో మరణం సంభవించడంతో తనూజ హైదరాబాద్‌లోనే ఉండటం ప్రారంభించారని తెలిపారు. ఈ ఘటనలో ఎంత బంగారం, నగదు అపహరించబడిందన్న అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎంపీవీ ఇన్విక్టో ఆన్‌రోడ్ ధరలు, వేరియంట్లు, 23.24 కిమీ మైలేజ్ విశేషాలు మరియు ఈఎంఐ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతదేశంలో ఫైవ్ స్టార్ మరియు లగ్జరీ హోటల్ రూమ్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే ఇవి ఇంకా తక్కువని, భవిష్యత్తులో ఒబెరాయ్, ఐటీసీ వంటి టాప్ హోటళ్ల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత గ్రూప్ మెగా డీమెర్జర్ తర్వాత విడిపోయిన అల్యూమినియం, ఐరన్ & స్టీల్, పవర్ మరియు ఆయిల్ కంపెనీల షేర్లు 5 శాతం వరకు దూసుకెళ్లాయి. క్యూ1 ఉత్పత్తి గణాంకాలు, భారీ టార్గెట్ ధరలతో బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ఈ స్టాక్స్ కొనుగోలుపై పూర్తి వివరాలు మీకోసం.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ప్రపంచకప్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. జట్ల సంఖ్యను 48కి పెంచడం ద్వారా భారత ఫుట్‌బాల్ జట్టుకు వరల్డ్‌కప్ అర్హత సాధించే సువర్ణావకాశం లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన 23 మంది పోలీస్ సిబ్బంది స్థానచలనం..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (29) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు
మా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అంటూ తల్లిదండ్రుల ఆవేదన..!
షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖనిజాభివృద్ధి రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు మరియు దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మార్చేందుకు
భారత రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే.. స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పిన అరుదైన నాయకులలో
తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ సంస్థ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్వార్థ రాజకీయాలే కారణమని
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సినీ వర్గాల్లో ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్‌చల్ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.