మానస సరోవరంలో 31 మంది హైదరాబాద్ యాత్రికులు సురక్షితం..!

Publish Date:Aug 27, 2026

Advertisement

 

నేపాల్‌లో  అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ఆ వరదల్లో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుండి 156 మంది నేపాల్ పర్యటన కోసం వెళ్లారు. అందులో 140 మంది నేపాల్ అందాలు చూసేందుకు వెళ్లారు. మిగిలిన 16 మంది వారు బస చేసిన గదిలోని విశ్రాంతి తీసుకుంటున్నా రు. అయితే నేపాల్ లో ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా చాలామంది ఆ వరదలో గల్లంతయ్యారు. అప్పటినుండి హైదరాబాదు నుండి వెళ్లిన యాత్రికులు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అందులో 31 మంది సురక్షితంగా ఉన్నామంటూ ఫోటోలు ,వీడియోలు విడుదల చేశారు. దీంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నేపాల్ మీదుగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 31 మంది యాత్రికులు మానస సరోవర్ వద్ద సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. 

నిన్న ఉదయం నేపాల్– టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు సంభవించినప్పటికీ, అంతకుముందే వరద ప్రభావిత ప్రాంతాన్ని దాటి మానస సరోవర్ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం యాత్రికులు మానస సరోవర్ వద్ద సురక్షితంగా ఉన్నామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇప్పటివరకు ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించింది. అయితే భారత్‌కు తిరిగి రావడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. టిబెట్ మీదుగా చైనాలోకి ప్రవేశించి, అక్కడి నుంచి భారత్‌కు చేరుకోవాలని యాత్రికులు భావిస్తు న్నారు. 

ఇందుకోసం చైనా సరిహద్దు మార్గం తెరవాల్సి ఉంది. సరిహద్దు పరిస్థితులు, రహదారుల పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాతే వారి తిరుగు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. భోటేకోశి నది పరివాహక ప్రాంతంలో రహదారులు, మౌలిక వసతులు దెబ్బతినడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది మంది యాత్రికులతో సంబంధాలు తెగిపోయి నట్లు అధికారులు, పర్యాటక సంస్థలు వెల్లడించాయి.


Nepal Floods,  Telugu pilgrims, Hyderabad Pilgrims, Kailash Mansarovar Yatra,  Stranded Indian Tourists, Telugu news, Telugu one, Manasarovar, Tibet, Chinna

By
en-us Political News

  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..?
తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి..!
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిన్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
హైదరాబాద్‌ నగరంలోని ఫిలింనగర్‌ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో  ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే..  రోజువారీ టెస్ట్ సిరీస్‌లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది.
న్న దుకాణంలో వచ్చే పరిమిత సంపాదనతో సంతృప్తి చెందకుండా.. అడ్డదారి తొక్కాడు.    గంజాయి చాక్లెట్ల విక్రయాల వైపు అడుగులు వేశాడు.
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.