Publish Date:Jun 25, 2026
మత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వేదికగా.. పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు ఒడ్డున జరిగే ఈ ఐదు రోజుల వార్షిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం (జూన్ 26) నుంచిఈ నెల 30 వరకు జరిగే ఈ వేడుకల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు నెల్లూరుకు తరలివస్తున్నారు. గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం ఒక పవిత్ర ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ రొట్టెల మార్పిడి. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విద్య, వ్యాపారాలు ఇలా తమ కోరికలు నెరవేరిన భక్తులు కృతజ్ఞతగా స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను ఇతరులకు సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను భక్తితో పుచ్చుకుంటారు. ఇలా కోర్కెలు తీరిన వారు ఇచ్చే రొట్టెలను అందుకోవడం వల్ల తమకు కూడా మంచి జరుగుతుందని విశ్వాసం. ఈ గౌరవిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఈ ఏడాది రొట్టెల పండుగకు 14 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.
భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక ఘాట్లు, సురక్షిత తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు, అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే.. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటు షికారు భక్తులను ఆకట్టుకుంటోంది. భద్రత పరంగా ఎలాంటి అవాంచేనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-rottela-panduga-kicks-off-on--grand-scale-36-224167.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.