ఉదయగిరిలో రాజకీయ మంటలు
Publish Date:Mar 7, 2012
Advertisement
నెల్లూరుజిల్లా: నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ మంటలు చెలరేగాయి. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. చంద్రసేఖరరేడ్డిపై అనర్హత వేటు పడిన వెంటనే ఉదయగిరిలో రాజకీయ అలజడి ప్రారంభమైంది. మేకపాటి చంద్రశేఖర రెడ్డి 1994లో రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పట్లో తనకు టిక్కెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేసి మాజీ మంత్రి మాదాల జానకీరామ్ ఓటమికి కారణమయ్యారు. 1999లో మేకపాటికి టిక్కెట్ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధి కంభం విజయరామిరేడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు మేకపాటికి ఉదయగిరి టిక్కెట్ ఇవ్వగా రెండుసార్లు గెలుపొందారు. వైఎస్ మరణానంతరం మేకపాటి జగన్ కు గట్టి మద్దతుదారుడుగా నిలిచాడు. దీనితో స్పీకర్ ఆయనపై విప్ ధిక్కార నెపంతో అనర్హత వేటు వేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మేకపాటి చంద్రశేఖరరెడ్డి లభించడం ఖాయం. తెలుగుదేశంపార్టీ తరపున బొల్లినేని వెంకటరామారావు పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
http://www.teluguone.com/news/content/nellore-district-24-12458.html





